IPL 2027: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఒకే ఓవర్‌లో 30 రన్స్.. పరువు తీసేసిన కోహ్లీ దోస్త్..!
Bhuvneshwar Kumar: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో భువనేశ్వర్ కుమార్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బెంగాల్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 30 పరుగులు సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఫామ్ కోల్పోయిన భువీ ప్రదర్శన RCBని ఆందోళనలో పడేసింది. అసలేం జరిగిందంటే?

Bhuvneshwar Kumar: నవంబర్ 24, మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 6వ రౌండ్‌లో ఉత్తరప్రదేశ్ జట్టు బెంగాల్‌తో తలపడింది. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైన భువనేశ్వర్ కుమార్‌పై అందరి కళ్లు ఉన్నాయి. టీమిండియాలో స్థానం నిలబెట్టుకోవాలంటే దేశవాళీ సీజన్‌లో రాణించాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.
36 ఏళ్ల భువీ ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అయితే బెంగాల్‌తో మ్యాచ్ మాత్రం RCB స్టార్‌కు ఊహించని విధంగా జరిగింది. ఒకే ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు ఇచ్చేశాడు.
భువీపై విరుచుకుపడిన అభిషేక్ పోరెల్, కరణ్ లాల్..
మ్యాచ్ 11వ ఓవర్‌లో భువనేశ్వర్ తన రెండో ఓవర్‌కు వచ్చాడు. తొలి ఓవర్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రెండో ఓవర్‌ను నో-బాల్‌తో ప్రారంభించాడు, అది సిక్స్‌గా వెళ్లింది. ఆ సిక్స్‌తోనే అభిషేక్ పోరెల్ 32 బంతుల్లో 50 పూర్తి చేశాడు.
ఎక్కువమంది చదివినది: భారత జట్టులో అతను వేస్ట్.. పీకిపారేయండి.. ఈ ఇద్దరిలో ఒకడు ఉంటే తొలి టెస్ట్ గెలిచేవాళ్లం..
చట్టబద్ధమైన బంతి వేయకుండానే 7 పరుగులు రాగా, ఆ తర్వాత సిక్స్‌కు తోడు ఫోర్ బాదాడు పోరెల్. రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్‌ను కరణ్ లాల్‌కు ఇచ్చాడు.
కరణ్ లాల్ భువనేశ్వర్‌పై విరుచుకుపడ్డాడు. 36 ఏళ్ల పేసర్‌ను వరుసగా రెండు సిక్సులు బాది కేవలం 21 బంతుల్లోనే తానూ ఫిఫ్టీ పూర్తి చేశాడు. 4 బంతుల్లోనే భువీ 24 పరుగులు ఇచ్చేశాడు. ఆ దెబ్బ తర్వాత వైడ్ వేశాడు.
అంతా 36 పరుగుల ఓవర్ అవుతుందని భయపడగా, కరణ్ లాల్ 5వ బంతికి ఫోర్, చివరి బంతికి సింగిల్ తీసి ఓవర్‌లో మొత్తం 30 పరుగులు రాబట్టారు. ఆ ఓవర్ ఇలా సాగింది.
భువనేశ్వర్ 30 రన్స్ ఓవర్:
1వ బంతి – నో బాల్ + 6
1వ (లీగల్ బంతి) – 4
2వ బంతి – 1
3వ బంతి – 6
4వ బంతి – 6
5వ బంతి – వైడ్
5వ (లీగల్ బంతి) – 4
6వ బంతి – 1
భువీ ఫామ్ RCBకి ఎందుకు ఆందోళన?
భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత ఫామ్ RCBకి నిజంగా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో 36 ఏళ్ల పేసర్ కీలక పాత్ర పోషించాడు.
IPL 2025లో 14 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు తీసి 9.29 ఎకానమీ నమోదు చేశాడు. IPL 2026లో 16 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లు తీసి 7.95 ఎకానమీతో అదరగొట్టాడు.
ఎక్కువమంది చదివినది: IND vs PAK: తిలక్ కాదు.. టీమిండియా ఓటమికి ఈ ముగ్గురు అసలైన విలన్లు..!
అయితే IPL 2026 తర్వాత భువీకి ఇండియా పిలుపు వచ్చి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు వెళ్లాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి 11.25 ఎకానమీ నమోదు చేశాడు.
SMAT 2026లో కూడా భువీ ఎకానమీ 9.85గా ఉంది. దీంతో రాబోయే సీజన్‌లో యూపీ క్రికెటర్ తన మ్యాజిక్ టచ్ కోల్పోయి పరుగులు ఇస్తాడేమోనని RCB భయపడుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




