సేవింగ్స్ అకౌంట్‌పై 3 రెట్లు అధిక వడ్డీ.. ఈ ఒక్క ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు.. ఎవ్వరూ ఇది చెప్పరు..
Savings Account: సేవింగ్స్ అకౌంట్లలోని బ్యాలెన్స్‌పై 2 నుంచి 3 శాతం వడ్డీ మాత్రమే అందుతుంది. కానీ మీరు ఈ ఒక్క ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఎఫ్‌డీ తరహా వడ్డీ రేట్లను పొందవచ్చు. చాలామంది ఖాతాదారులకు ఈ ఫీచర్ తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది ఏంటంటే..

దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ కూడా సేవింగ్స్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల నగదు పొందేందుకు, రోజువారీ అవసరాల కోసం నగదు నిల్వ చేసుకునేందుకు పొదుపు ఖాతా ఉపయోగిస్తారు. చాలామంది ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లు వేర్వురు బ్యాంకుల్లో కలిగి ఉంటారు. అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండటం కూడా నష్టాన్ని కల్గిస్తుంది. డెబిట్ కార్డు, ఎస్ఎంఎస్ ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ నిల్వ చేయకపోతే ఛార్జీలు వంటివి భారంగా మారతాయి. కానీ వివిధ అవసరాల కోసం రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లను చాలామంది ఉపయోగిస్తున్నారు.
ఈ బెనిఫిట్ చాలామందికి తెలియదు..
అయితే సేవింగ్స్ అకౌంట్లోని నగదుపై వార్షిక వడ్డీ 2.5 శాతం నుంచి 3 శాతం వరకు లభిస్తుంది. బ్యాంకును బట్టి ఈ వడ్డీ రేట్లు మారుతాయి. ఇది చాలా తక్కువ వడ్డీగా చెప్పవచ్చు. కానీ సేవింగ్స్ అకౌంట్‌ను కేవలం రోజువారీ, అత్యవసర అవసరాలకు భద్రపర్చుకున్న నగదు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని ఉపయోగిస్తారు. అయితే చాలామందికి ఖాతాదారులకు ఒక విషయం తెలియదు. మీరు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా అత్యధిక ఆదాయం పొందే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ఒక్క పని చేయడం వల్ల మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల తరహాలోనే అధిక వడ్డీ పొందవచ్చు. అదే ఆటో స్వీప్ సర్వీస్. మీరు బ్యాంక్‌కు వెళ్లి ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయించుకోవడం వల్ల ఎఫ్‌డీకి సమానమైన వడ్డీ రేట్లను పొందవచ్చు. అంటే సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్ల కంటే మూడు రెట్లు అధికంగా పొందవచ్చు.
ఆటో స్వీప్ సర్వీస్ ఎలా పనిచేస్తుంది..
మీరు సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాకు ఆటో స్వీప్ సర్వీస్ యాక్టివ్ చేసుకోవడం వల్ల.. మీ అకౌంట్లోని నగదు స్వీప్ పరిమితిని మించినప్పుడు మిగిలిన నిధులపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లను వర్తింపచేస్తారు. ఉదాహరణకు మీరు ఆటో స్వీప్ లిమిట్ రూ.30 వేలుగా ఫిక్స్ చేశారనుకుందాం.. మీ ఖాతాలో మీరు రూ.90 వేలు డిపాజిట్ చేసినప్పుడు.. మిగిలిన రూ.60 వేలకు ఆటో స్వీప్ యాక్టివేట్ అవుతుంది. ఈ నిధులను ఎఫ్‌డీగా మార్చుతారు. దీని వల్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. మిగిలిన రూ.30 వేలుపై సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అయితే ఈ ఎఫ్‌డీ మార్చబడిన అదనపు నిధులను మీరు ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా ఎఫ్‌డీలకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆటో స్వీప్ సర్వీసులకు మెచ్యూరిటీ సమయం అనేది ఉండదు. దీని వల్ల మీరు ప్రత్యేకంగా ఎఫ్‌డీ ఖాతా తెరవాల్సిన పని ఉండదుజ.
