వాట్సప్‌లోనే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.. త్వరలోనే..

Venkatrao Lella

Images: Pinterest

22  NOV 2026

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల కొత్తగా ఈ సదుపాయం ప్రవేశపెట్టింది.

ఇక నుంచి పీఎఫ్ బ్యాలెన్స్, పాస్‌బుక్ డౌన్‌లోడ్, చివరి ఐదు లావాదేవీలు వాట్సప్ ద్వారానే తెలుసుకోవచ్చు. గతంలో ఇందుకోసం పీఎఫ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పని తప్పింది.

కేవలం వాట్సప్‌లో హాయ్ అనే మెస్సేజ్ పెట్టడం ద్వారా మీరు పీఎఫ్ సేవలను సులువుగా పొందవచ్చు. సెకన్లలోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడంతో పాటు పాస్ బుక్ కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ అధికారిక వాట్సప్ నెంబర్ 8796441800 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టాలి. ఆ తర్వాత మీ భాషను ఎంచుకోవాలి. అనంతరం ఆప్షన్లలో పీఎఫ్ బ్యాలెన్స్ ఎంచుకోవాలి.

పీఎఫ్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. మీ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమైన కంపెనీలన్నీ కనిపిస్తాయి. అక్కడ కంపెనీని ఎంచుకోవాలి. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ ప్రదర్శించబడుతుంది.

పీఎఫ్ ఎంప్లాయర్, ఎంప్లాయి, పెన్షన్ కేటగిరీలో ఎంత అమౌంట్ ఉందనేది తెలుస్తుంది. పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఆప్షన్లలో పాస్ బుక్ డౌన్ లోడ్ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.

ఇక చివరి ఐదు లావాదేవీల ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మీ గత ఐదు లావాదేవీల హిస్టరీ కనిపిస్తాయి. దీని వల్ల మీరు లావాదేవీలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు బహుళ ప్రాంతీయ బాషల్లో పీఎఫ్ వాట్సప్ సేవలను పొందే అవకాశముంది. దీని వల్ల ఖాతాదారులు పీఎఫ్ సమాచారం మొత్తాన్ని సౌకర్యవంతంగా పొందవచ్చు.

అయితే వాట్సప్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఫీచర్‌ను కూడా రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టాలని ఈపీఎఫ్ఓ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రణాళిక దశలో ఉంది. రాబోయే రోజుల్లో రావచ్చు.