AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ జయంతి

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజును భారతదేశంలో జాతీయ సెలవుదినంగా పాటిస్తారు.. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతి రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తోంది. గాంధీజీ సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని నడిపించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల ద్వారా ఆయన లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపారు. ఈ రోజున న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ఆయన సమాధికి ప్రముఖులు నివాళులర్పిస్తారు. పాఠశాలలు, కార్యాలయాలలో గాంధీజీకి నివాళులర్పించడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన శాంతి సందేశాన్ని స్మరించుకుంటారు.

ఇంకా చదవండి

గాంధీ జయంతి లాంగ్ వీకెండ్.. 3 రోజుల్లో చుట్టొచ్చే బెస్ట్ టూరిస్ట్ ప్లేసులు ఇవే!

Long Weekend Trip: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మూడు రోజుల లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ సెలవుల్లో అదనంగా సెలవు పెట్టకుండానే చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలో చేరుకునే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి ప్రదేశాలు, హెరిటేజ్ డెస్టినేషన్లు ఏవో తెలుసుకోండి.

Hyderabad: మాంసం ప్రియులకు అలర్ట్.. ఆ రోజంతా మటన్, చికెన్ షాపులు బంద్!

GHMC హైదరాబాద్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చికెన్, బీఫ్ షాపులను మూసివేయాలని ఆదేశించింది. వధశాలలు, మాంసం విక్రయ కేంద్రాలు ఆ రోజున కార్యకలాపాలు నిలిపివేయాలి. మాంసం ప్రియులు ముందుగానే తమ కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవాలి. ఈ ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని పోలీస్ శాఖను కోరింది.