తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆంధ్రప్రభలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2000 నుంచి 2002 వరకు హైదరాబాద్ లో ఆంధ్రప్రభ రిపోర్టర్ గా, 2002 నుంచి 2003 జూలై వరకు ఆంధ్రప్రభలో మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ గా పని చేశారు. 2003 ఆగస్టులో టివి9 సంస్థలో అడుగు పెట్టారు. ప్రస్తుతం టివి9 ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయ సామాజిక సమస్యలపై అనేక ప్రత్యేక కథనాలు రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. నల్లగొండ జిల్లాను పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్య, గిరిజన తండాల్లో శిశు విక్రయాలపై ప్రత్యేక కథనాలు రాసి జాతీయ స్థాయిలో ప్రాచూర్యం తీసుకువచ్చారు. 2005లో జరిగి ఘోర డెల్టా రైలు ప్రమాద సమయంలో అనేక మానవీయ కథనాలు రాశారు. 2009లో కృష్ణా నదికి వచ్చిన వరదలను కవర్ చేశారు. 2016లో జిల్లాలో కృష్ణ పుష్కరాలను కవర్ చేశారు. 2004 నుండి వరసగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కవర్ చేస్తూ ప్రత్యేక కథనాలు రాశారు. పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలరు. రాజకీయ, వర్తమాన, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, ఇతర వార్తల సేకరణలో అందరికంటే ముందుండాలని తపన పడతారు.
Telangana: అద్భుతం.. యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర.. ఔరా అనాల్సిందే
చేనేత కళాకారుల కాణాచి తెలంగాణ రాష్ట్రం. ఒకనాటి వైభవంగా మిగిలిపోయిన అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీనీ చేనేత కార్మికుల వారసులు మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. తాజాగా భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహుడి సన్నిధిలోని అమ్మ వారికి అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు చీరను కానుకగా సమర్పించారు.
- M Revan Reddy
- Updated on: Dec 18, 2025
- 10:31 am
అక్క వరుసయ్యే మహిళతో ఆ యవ్వారం.. కట్ చేస్తే, ఆమె భర్త ఎంట్రీతో..
వివాహేతర సంబంధాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వరుసకు సోదరి అయ్యే మహిళతో ఓ యువకుడు అక్రమ బంధాన్ని కొనసాగించాడు. చివరికి ప్రాణాలనే కోల్పోయాడు. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్న యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 18, 2025
- 10:02 am
Telangana: ఊరంతా కరెంట్ షాక్.. ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా..
విద్యుత్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామంలో నివాస గృహాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తండా వాసులు ఉలిక్కిపడ్డారు. తండాలోని పలు ఇళ్లలో గృహోపకరణాలు టీవీలు, ఫ్రిజ్‌లు కాలిపోయి భారీ నష్టం వాటిల్లింది.
- M Revan Reddy
- Updated on: Dec 17, 2025
- 4:07 pm
Telangana: ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
కన్నతల్లిని పుట్టినరోజు మరవకూడదని అంటారు. కన్నతల్లి లాంటి ఊరికి సేవ చేయాలనే భావించాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పులి వెంకటేశ్వర్లు. కానిస్టేబుల్‌గా కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎస్సై స్థాయికి ఎదిగాడు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన..
- M Revan Reddy
- Updated on: Dec 15, 2025
- 4:33 pm
అదిరిందయ్యా చంద్రం.. 95 ఏళ్ల వయస్సులోనూ సర్పంచ్‌గా విజయం.. రాష్ట్రంలో ఆయనొక్కరే..
ప్రస్తుత జీవన విధానంలో 60 ఏళ్లకే చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. కనీసం నడవలేక పోతున్నారు. కానీ ఇక్కడో 95 ఏళ్ల వయస్సులో ప్రజాసేవ చేయాలనుకున్నాడో నవ యువకుడు. ఆ వయసులోనూ ఆయన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాడు. అభివృద్ధి అనే పదాన్ని నినాదంగా ఎత్తుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఇంతకు ఆయనెవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.
- M Revan Reddy
- Updated on: Dec 13, 2025
- 3:15 pm
Telangana: ఎన్నికలు అయిపోయాక మళ్లీ ఇంటింటికి ఓడిన అభ్యర్థి.. ఎందుకంటే..?
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోయారు. కానీ ఓడిపోయిన కొందరు అభ్యర్థులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని దేవుడి ఫోటోతో ఇళ్లు.. ఇళ్ళు తిరుగుతూ వేడుకుంటున్నారు. అలాంటి ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
- M Revan Reddy
- Updated on: Dec 13, 2025
- 3:08 pm
Telangana: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త దారుణ హత్య..
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా ఉద్రిక్తంగా మారింది. నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్‌కు చెందిన ఉప్పల మల్లయ్య అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్–బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.
- M Revan Reddy
- Updated on: Dec 10, 2025
- 8:40 pm
Telangana: 10 బంగారు బిస్కెట్లు రూ. 18 లక్షలే.! లచ్చలు లచ్చలు పోశారు.. సీన్ కట్ చేస్తే
సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు నింగి నంటూతున్నాయి. కేటుగాళ్ళు మాత్రం ఇదే మంచి అవకాశంగా నకిలీ బంగారంతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. తక్కువ ధరకు అసలైన బంగారం ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ నకిలీ బంగారం అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బంగారు బిస్కెట్లు అంటగట్టి మోసం చేస్తున్న ముఠాకు సూర్యాపేట పోలీసులు చెక్ పెట్టారు.
- M Revan Reddy
- Updated on: Dec 9, 2025
- 12:47 pm
Yadadri Temple: యాదగిరి నరసన్న భక్తులకు గుడ్ న్యూస్..
ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లోని సామాన్య భక్తులు ఇంకా స్వామివారి చెంతకు రాలేకపోతున్నారు. సామాన్య భక్తుల కోసం యాదగిరిగుట్ట దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతోంది. ఆ కార్యక్రమం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 8, 2025
- 10:46 am
Bibinagar: సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్ వేశారు.. డమ్మీ అనుకునేరు
రాజకీయాల్లో అవకాశముంటే కుటుంబ సభ్యులందరూ పోటీ చేస్తుంటారు. ఒక్కోసారి డమ్మీ అభ్యర్థులుగా కుటుంబ సభ్యులతో నామినేషన్ వేయిస్తుంటారు. అదే సందర్భంలో కొందరు జ్యోతిష్యాల సూచనలు కూడా పాటిస్తుంటారు. కానీ ఓ సర్పంచ్ అభ్యర్థి తన గెలుపు కోసం భార్యని ఏం చేశాడో.. తెలిస్తే అందరూ షాక్ అవుతారు.
- M Revan Reddy
- Updated on: Dec 7, 2025
- 10:07 am
Nalgonda: హిస్టరీలో ఫస్ట్ టైం.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని లంచం అడిగాడు..
సాధారణంగా అధికారులు పనులు చేయడానికి, బిల్లులు మంజూరు చేయడానికి లంచాలు తీసుకుంటారు. అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు ప్రజలకు ఉన్న వజ్రాయుధం సమాచర హక్కు చట్టం. కానీ ఓ అధికారి ఆర్టిఐ కింద సమాచారం అడిగిన వ్యక్తి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ అవినీతికొంగ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 7, 2025
- 9:56 am
పంచాయతీ ఎన్నికల బరిలో 95 ఏళ్ల నవ యువకుడు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా యువకులు పోటీ చేస్తున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది చెబుతున్నారు కూడా.. కానీ 95 ఏళ్ల వ్యక్తి మాత్రం.. తాను యువతతో పాటు పోటీపడతా అంటూ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో యువతను ఢీ కొట్టేందుకు 95 ఏళ్ల నవ యువకుడు బరిలోకి దిగాడు. ఆ నవ యువకుడు ఎక్కడ పోటీ చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
- M Revan Reddy
- Updated on: Dec 6, 2025
- 3:35 pm