మూడేళ్లలో ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఇంటి జాగా అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది నాడు 2.5 లక్షల ఇళ్ల కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, పట్టణాల్లో అమృత్ పథకం, వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.