AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మాయమాటలు చెప్పి మర్పించాడు.. సైలెంట్‌గా పనికానిచ్చాడు.. సీన్ కట్‌చేస్తే..

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న యువకులు మోసగాళ్లుగా మారుతున్నారు. బెట్టింగ్‌కు అవసరమైన డబ్బుల కోసం పనిచేసే సంస్థతో పాటు అమాయకులను కూడా మోసం చేస్తున్నారు. తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడి ఇలా మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టి.. కటకటాల పాలు చేశారు. ఇంతకు అతనేం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Telangana: మాయమాటలు చెప్పి మర్పించాడు.. సైలెంట్‌గా పనికానిచ్చాడు.. సీన్ కట్‌చేస్తే..
Finance Manager's Betting Fraud
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 06, 2026 | 3:12 PM

Share

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన లొడంగి యాదగిరి రెండేళ్లుగా ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(ఐఐఎఫ్ఎల్) మిర్యాలగూడ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. యాదగిరికి క్రికెట్ బెట్టింగ్స్ లో పాల్గొనేవాడు. క్రికెట్ బెట్టింగ్ లో ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా.. యాదగిరి తీరులో మాత్రం మార్పు రాలేదు. క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం తను పనిచేస్తున్న సంస్థతోపాటు అమాయకులను మోసం చేయడం స్టార్ట్ చేశాడు.

ఐఐఎఫ్ఎల్ లో ఏడాది, రెండేళ్ల క్రితం రుణాలు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించే స్థోమత లేకపోతే బహిరంగ మార్కెట్ ధరకు జ్యువెలరీ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన మండల శంకర్ తాను తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు బంగారు వ్యాపారి మడూరి ఉపేంద్రచారితో కలిసి ఫైనాన్స్ సంస్థకు వెళ్లారు. తాకట్టులో ఉన్న బంగారం విడిపించేందుకు రూ.9.60లక్షలు కట్టాలని మేనేజర్ యాదగిరి లెక్క చెప్పాడు. దీంతో ఆ డబ్బులు చెల్లించేందుకు శంకర్ సిద్ధమయ్యాడు.

ఇదే అదునుగా భావించి శంకర్ చెల్లించే డబ్బులను ఎలాగైనా తన ఖాతాలో జమ చేయించుకోవాలని మేనేజర్ యాదగిరి పథకం వేశాడు. అయితే శంకర్ డబ్బులు తీసుకుని రాగా, ఫైనాన్స్ సంస్థ కరెంట్ అకౌంట్ పనిచేయడం లేదని, ఆ డబ్బు తన అకౌంట్ కు పంపిస్తే మరుసటిరోజు కరెంట్ అకౌంట్ లో జమచేసి గోల్డ్ రిలీజ్ ప్రాసెస్ పూర్తిచేస్తానని శంకర్ ను యాదగిరి నమ్మించాడు. శంకర్ ఆ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ వ్యక్తిగత ఖాతాకు పంపగా, గోల్డ్ లోన్ ఖాతాకు జమ చేయకుండా పాస్వర్డ్ తప్పుగా నమోదుచేస్తూ తాకట్టు ఆభరణాలు ఇవ్వకుండా వాయిదాలు చెప్పడం మొదలు పెట్టాడు.

ఇక ఎంతకీ ఆభరణాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శంకర్ ఈ నెల 3వ తేదీన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో మేనేజర్ యాదగిరి తన నేరాన్ని అంగీకరించాడు. గతంలో కూడా ఇదే రకమైన మోసాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపారు. యాదగిరి నుంచి రూ.4లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us