AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమానుషం.. హోటల్‌ ముందు వచ్చి అడుకుంటున్నాడని.. ఏం చేశారో చూడండి..

ఒక మనిషికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దారుణమైన స్థితికి సమాజం దిగజారుతోంది. ఆర్థిక సాయం చేయలేకపోయినా ఆకలితో ఉన్నవారికి ఇంత భోజనం పెట్టే పెద్ద మనసు కూడా ఎవరికి లేకుండా పోయింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అడుకున్నేందుకు వచ్చిన ఓ బిచ్చగాడిపై కనికరం లేకుండా హోటల్ నిర్వాహకుడు వేడి నీళ్లు పోయడం తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: అమానుషం.. హోటల్‌ ముందు వచ్చి అడుకుంటున్నాడని.. ఏం చేశారో చూడండి..
Hyderabad Horror
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 5:54 PM

Share

హైదరాబాద్ నగరంలో లెక్కలేనన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వెలిశాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ రకాల వంటకాలను వండి, వడ్డించి బాగానే డబ్బులు దండుకుంటారు. పైగా వాళ్ళు ఒక రోజు వండే దాంట్లో ఎంతో కొంత వృధాగా చెత్తలో పడేస్తూనే ఉంటారు. అలా ఆహారం వృథాగా పోతే రాని బాధ.. ఆకలితో ఉన్న ఒక మనిషికి పెట్టాల్సి వస్తున్నప్పుడు కలుగుతుందంటే ఆలోచించాల్సిన విషయమే. ఆకలితో తినడానికి ఏమైనా దొరుకుతుందనే ఆశతో హోటల్ వద్దకు వచ్చిన ఓ బిచ్చగాడిపై యాజమాన్యం వేడి నీళ్లు పోసి, మంట పుట్టించే ఎర్రని మిరప పొడి వేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ తతంగాన్ని మహ్మద్ ఇబ్రహీం ఖాన్ అనే ఓ సోషల్ వర్కర్ వీడియో ద్వారా బయట్టడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.

వేడి వేడి నీరు శరీరంపై పడి బాధితుడు విలవిలలాడుతుండగానే సదురు వ్యక్తి యాజమాన్యాన్ని ఎదురుగా నిలబెట్టి ఇలా ఎందుకు దారుణంగా ప్రవర్తించారని నిలదీశాడు. అతను రోజూ హోటల్ ముందుకు వచ్చిపోయే తమ కస్టమర్లకు ఇబ్బందులు పెడుతున్నాడని సదురు నిర్వాహకులు చెప్పుకొచ్చారు.. అలా అయితే బెదిరించి అక్కడి నుంచి పంపేయడమో.. లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడమే చేయాలి గానీ ఇలా వేడి నీళ్లు పోసి అత్యంత దారుణంగా ప్రవర్తిస్తారా సదరు వ్యక్తి ప్రశ్నించగా సదురు నిర్వాహకులు ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుతిరిగాడు.

సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. సాటి మనిషి పట్ల ఇంత కూడా దయ లేకుండా ప్రవర్తించడం క్షమించరాని నేరమని కొందరు కామెంట్ చేశారు. ఈ దారుణ ఘటనని కళ్లారా చూసిన స్థానికులు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మీర్ చౌక్ పోలీసులు హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us