AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.7 రేటింగ్.. మతిపొగొట్టే ట్విస్టులు

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.7 రేటింగ్.. మతిపొగొట్టే ట్విస్టులు
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 25, 2026 | 2:27 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలో పలు కొత్త సినిమాలు రానున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పలు ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం, ఆనంది గరివిడి లక్ష్మి, హిందీ దృశ్యం 3.. ది కంక్లూజన్, హనుమాన్ అంశ్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ వే తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఈ మధ్యన కొన్ని సినిమాలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డైరెక్టుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. అలా తాజాగా ఓ చిత్రం సడన్‌గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కన్నడంలో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ బుధవారం (నవంబర్ 25) నుంచే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇదొక మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఈ ఏడాది సెప్టెంబర్ 24న థియేటర్లలో రిలీజైంది. ఆకట్టుకునేలా కథ కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా కన్నడ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇప్పుడీ సినిమానే సడెన్ గా ఓటీటీలోకి తీసుకొచ్చారు మేకర్స్.

ఒంటరి, మహాత్మ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ భావనా మీనన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ స్పార్క్’ (Spark). సెప్టెంబర్ 25న విడుదలైన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో భావనతో పాటు నిరంజన్ సుధీంద్ర, ప్రేమ్ కుమార్, రచన ఇందర్, రమేష్ ఇందిర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డి. మహంతేశ హండ్రాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒక పెద్ద బ్యాంక్ కుంభకోణాన్ని ఛేదించే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారిని ఎలా కనిపెట్టారనేదే ఈ స్పార్క్ మూవీ స్టోరీ. భావన వైదేహి అనే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ మూవీ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం కేవలం కన్నడలో మాత్రమే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో భావనా మేనన్ స్పార్క్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us