AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: బుధుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఘన విజయాలు ఖాయం!

Mercury Transit 2026: డిసెంబర్‌లో బుధ గ్రహ సంచారంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. ఈ గ్రహ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వృద్ధి వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా తెలివితేటలు, కొత్త ప్రయత్నాలు, ఒప్పందాలు, సమస్యల పరిష్కారంలో విజయాలు సాధించే అవకాశం ఉంది. డిసెంబర్ 22 వరకు కొనసాగే ఈ గ్రహ సంచారం వల్ల అదృష్టం పట్టనున్న ఆ ఆరు రాశులేవి?

Budh Gochar: బుధుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఘన విజయాలు ఖాయం!
Budh Gochar 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 25, 2026 | 1:56 PM

Share

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడి రాశి మార్పునకు ఎంతో ప్రత్యేకత ఉంది. బుధుడిని కమ్యూనికేషన్, ప్రయాణాలు, విజయాలు, సాఫల్యాలు, ఒప్పందాలు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యు లేషన్లు, తెలివితేటలు, సమస్యల పరిష్కారం, విజ్ఞానానికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు రాశి మారినప్పు డల్లా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. డిసెంబర్ 3న వృశ్చిక రాశిలో సంచారం ప్రారంభించబోతున్న బుధ గ్రహం (Mercury Transit in Scorpio) తప్పకుండా కొన్ని రాశులకు అనుకూల ఫలితాలనివ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి బుధుడికి శత్రు క్షేత్రం. డిసెంబర్ 22 వరకు వృశ్చిక రాశిలో కొనసాగబోతున్న బుధుడి వల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం, కుంభ రాశుల వారికి ఈ బుధుడు యోగదాయకం కాబోతున్నాడు.

వృషభం

ఈ రాశికి బుధుడు సప్తమ రాశిలో సంచారం చేయడం వల్ల సమయస్ఫూర్తితో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించడం జరుగుతుంది. దాంపత్య సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రతిభ, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. మీ సలహాలు, సూచనలు అధికారులకు లాభం కలిగిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

కర్కాటకం

ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడి సంచారం వల్ల వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభా పాటవాలు బాగా ప్రకాశి స్తాయి. నైపుణ్యాల వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఎలాంటి ప్రయత్నమైనా, ఎలాంటినిర్ణయమైనా సత్ఫలితాలనిస్తుంది.

ఇవి కూడా చదవండి

సింహం

ఈ రాశికి నాలుగవ స్థానంలో బుధుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధుమిత్రులకు మీ సలహాలు, సూచనలు లబ్ధి చేకూరుస్తాయి. మాతృ సౌఖ్యం కలుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

తుల

ఈ రాశికి ధన స్థానంలో బుధ ప్రవేశం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థికంగా స్థిరత్వం లభించడం, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెంచ డానికి సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. షేర్లు లాభిస్తాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి.

మకరం

ఈ రాశికి లాభ స్థానంలో భాగ్యాధిపతి బుధుడు ప్రవేశించడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమ వుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని పూర్తిగా చక్కబెడతారు. ఆస్తి వివాదాలు అను కూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

కుంభం

ఈ రాశికి దశమ స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభా పాట వాలు బాగా రాణిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Follow Us