నవంబర్ 25 రాశిఫలాలు: వారికి మానసిక ప్రశాంతత.. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం!
Horoscope Today (25 November 2026): బుధవారం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరికొందరికి కుటుంబ సభ్యుల సహకారం, మానసిక ప్రశాంతత లభించనున్నాయి. ప్రయాణాలు కూడా కొందరికి లాభదాయకంగా మారనున్నాయి. మరి నవంబర్ 25న మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దిన ఫలాలు (నవంబర్ 25, 2026): మేష రాశి వారు ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు కొన్ని కొత్త అవకాశాలు అందుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశముంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి చాలావరకు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. కుటుంబ పరిస్థితులు హ్యాపీగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు కానీ, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.బంధు మిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అధికారులు పని భారం పెంచే సూచనలున్నాయి. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిత్రార్జితం కలిసి వస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ సంబంధమైన బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వాహన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయానికి లోటుండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇష్టమైన బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ పరిస్థితులు ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆశించిన శుభవార్తలు అందే అవకాశముంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఏమాత్రం లోటుండదు. ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్నేహితుల వల్ల డబ్బు నష్టం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. అనుకోకుండా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో కొద్దిగా. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల్ని పొందుతారు. కొద్దిపాటి మార్పులతో వ్యాపారాలను లాభాల బాటపట్టిస్తారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం, ఆరోగ్యం మెరుగైన స్థితిలో ఉంటాయి. ఆర్థికంగా కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడ తారు. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరగడానికి అవకాశముంది. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇతరుల మీద ఆధారపడవద్దు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఏ విషయంలోనూ ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.



