AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీ వనంలో కలుపు మొక్క.. యూనిఫామ్ ముసుగులో చీకటి దందా.. అధికారులే షాక్!

జార్ఖండ్‌లో పోలీస్ శాఖను విస్మయానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి అక్రమ నల్లమందు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చైబాసా జిల్లా సోనువా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

ఖాకీ వనంలో కలుపు మొక్క.. యూనిఫామ్ ముసుగులో చీకటి దందా.. అధికారులే షాక్!
Opium Smuggling Case
Balaraju Goud
|

Updated on: Nov 24, 2026 | 10:54 PM

Share

జార్ఖండ్‌లో పోలీస్ శాఖను విస్మయానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి అక్రమ నల్లమందు వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చైబాసా జిల్లా సోనువా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కిలోకు పైగా నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. గత మూడు నుంచి నాలుగేళ్లుగా వీరు అక్రమంగా నల్లమందు సాగు చేస్తూ, విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

చక్రధర్‌పూర్ ఎస్‌డీపీఓ, ఐపీఎస్ అధికారి డాక్టర్ సయ్యద్ ముస్తఫా హష్మీ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కున్వర్ సింగ్ గగ్రాయ్ కొన్నేళ్లుగా రహస్యంగా నల్లమందు సాగు, అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. పోలీస్ శాఖలో తనకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించుకుంటూ ఇన్నాళ్లూ తప్పించుకుంటున్నట్లు వివరించారు.

ఈ సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఐపీఎస్ అమిత్ రేణు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌డీపీఓ పర్యవేక్షణలో నిఘా పెంచారు. నవంబర్ 23న ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై నల్లమందును అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.

దీంతో సోనువా బజార్ నుంచి పన్సువా డ్యామ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై బంజికుసుమ్ మలుపు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కున్వర్ సింగ్ గగ్రాయ్, రేలా హోరో అలియాస్ రేలా కచ్ఛప్‌లను అడ్డుకున్నారు. తొలుత తమ పలుకుబడిని ఉపయోగించి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

చట్టపరమైన నిబంధనల ప్రకారం నిర్వహించిన తనిఖీల్లో వారి బ్యాగులో ఒక కిలోగ్రాముకు పైగా నల్లమందు లభించింది. దీంతో ఇద్దరినీ అరెస్టు చేశారు. విచారణలో గత మూడు నుంచి నాలుగేళ్లుగా నల్లమందును అక్రమంగా సాగు చేస్తూ, విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయమే తమ జీవనాధారంగా మారిందని నిందితులు వెల్లడించినట్లు సమాచారం. వీరు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నల్లమందు అక్రమ వ్యాపార నెట్‌వర్క్‌లో భాగమని, అందులో కున్వర్ సింగ్ గగ్రాయ్ కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఇద్దరు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ అక్రమ నల్లమందు నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? సాగు, రవాణా, విక్రయాలకు సహకరించిన వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రక్షణ బాధ్యతల్లో ఉండాల్సిన పోలీస్ అధికారే అక్రమ మాదకద్రవ్యాల దందాలో నిందితుడిగా పట్టుబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us