AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా మనసును కదిలించింది.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ !!

యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన "ఆకాశంలో ఒక తార" మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా మూవీపై ప్రశంసలు కురిపించారు. తన మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

నా మనసును కదిలించింది.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ !!
Megastar Chiranjeevi
Korivi Jayakumar
|

Updated on: Nov 24, 2026 | 9:56 PM

Share

యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గానే ఆయన నటించిన “ఆకాశంలో ఒక తార” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమైంది. శృతిహాసన్, రుహాని శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకొని ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేస్తుంది. ఓ స్ఫూర్తిదాయకమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. భార్యకు అండగా నిలబడిన ఒక భర్తగా మర్చిపోలేని పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా మూవీపై ప్రశంసలు కురిపించారు.

మనసును కదిలించింది..

ఈ మేరకు చిరు ఆ పోస్టులో.. ”ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారని.. శ్రుతి హాసన్, రుహానీ శర్మతో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని మెచ్చుకున్నారు. తల్లిదండ్రులందరూ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా అని కితాబిచ్చారు. ఈ చిత్రం వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్నారు. తన మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది అని.. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని రాసుకొచ్చారు.

మరీ ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని పోస్ట్ చేశారు. అలానే జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, డీఓపీ సుజిత్ సారంగ్ అద్భుతమైన కెమెరా వర్క్ కథలోని ఎమోషన్స్ ని మనసుకు హత్తుకునేలా చేశాయని తెలిపారు. ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి తన హృదయపూర్వక అభినందనలు” అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

పాన్ ఇండియా క్రేజ్..

కాగా మలయాళ స్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు దుల్కర్. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందనడంలో సందేహం అక్కర్లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

తెలుగులో 100% స్ట్రైక్ రేట్ హీరో..

ఇక మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో అభిమానులను సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత సీతారామం సినిమాతో ఒక క్లాసిక్ హిట్ అందుకోగా.. లక్కీ భాస్కర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో 100% స్ట్రైక్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు.

మెగాస్టార్ పోస్ట్..

Follow Us