AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి పక్కన ఆ హీరోయిన్స్.. వద్దంటే వద్దన్న ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏం చేశారంటే

దర్శకుడు కొదండరామి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో ఇద్దరు కొత్త హీరోయిన్లను ఎంపిక చేసిన వైనంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అభిమానుల వ్యతిరేకతను పక్కన పెట్టి తన నిర్ణయానికి కట్టుబడ్డారని తెలిపారు. ఆయన నిరాడంబరత, స్నేహబంధం, అదృష్టంపై ఆయనకున్న అభిప్రాయాలు పంచుకున్నారు

చిరంజీవి పక్కన ఆ హీరోయిన్స్.. వద్దంటే వద్దన్న ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏం చేశారంటే
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2026 | 1:09 PM

Share

టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు కొదండరామి రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి చిత్రం గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవంబర్ 22న ముఠా మేస్త్రి రీ-రిలీజ్ అయ్యింది ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఠా మేస్త్రి చిత్రంలో చిరంజీవి పక్కన రోజా, మీనా వంటి కొత్త హీరోయిన్లను ఎంపిక చేయడంపై అప్పట్లో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని కొదండరామి రెడ్డి తెలిపారు. “చిరంజీవి గారి పక్కన సెకండ్ గ్రేడ్ హీరోయిన్స్‌ను ఎందుకు పెడుతున్నారు?” అని అభిమానులు ప్రశ్నించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, అప్పటివరకు చేసిన నటీనటులు బోర్ కొట్టేశారని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

కొత్త ఫ్రేమ్, కొత్త హీరోయిన్‌తో చిరంజీవి పాటలు, నటన కొత్తగా కనిపిస్తాయని, ప్రేక్షకులకు విభిన్న అనుభూతి లభిస్తుందని తాను అభిమానులకు వివరించానని చెప్పారు. తన నమ్మకం నిజమై, రోజా, మీనా తర్వాతి కాలంలో అగ్రతారలుగా ఎదిగారు. రాజ్-కోటి సంగీతం, ముఖ్యంగా ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన మార్కెట్ సాంగ్ అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచిందని, ఇప్పటికీ ట్రెండ్‌లో ఉందని ఆయన అన్నారు. తన విజయాలను గురించి మాట్లాడుతూ, కొదండరామి రెడ్డి తన నిరాడంబరతను చాటుకున్నారు. ఎప్పుడూ గౌరవం కోరుకోలేదని, తన గౌరవం తగ్గుతుందని తాను ఎప్పుడూ భావించలేదని ఆయన పేర్కొన్నారు. “తలకెక్కలేదు నాకు” అని తన విజయాలపై వ్యాఖ్యానించారు. “నేను నడుస్తుంటే అందరూ నమస్కారాలు పెట్టాలి, నేను వెళ్తా ఉంటే అందరూ లేచి నించోవాలి అనే కాన్సెప్ట్ అసలు లేదు నాకు. అట్లా చేస్తే కోపం వస్తుంది నాకు” అని ఆయన వివరించారు.

చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానని, కేవలం కొన్ని సినిమాలు హిట్ కాగానే గర్వం రాకూడదని ఆయన గట్టిగా నమ్మారు. తాను అందరితో సరదాగా ఉంటానని, మామూలుగా తిరుగుతుంటానని, “మామూలుగా తిరగక ఎలా తిరగాలి?” అని ప్రశ్నిస్తూ తన వినయాన్ని ప్రదర్శించారు. తన స్నేహబంధాల గురించి మాట్లాడుతూ, దర్శకులు బి. గోపాల్, ఎస్. గోపాల్ రెడ్డిలతో తనకున్న బలమైన స్నేహాన్ని గురించి వివరించారు. వారితో కలిసి సరదాగా ఒక కిట్టీ పార్టీ ఏర్పాటు చేసుకున్నామని, ప్రతీ 15 రోజులకు ఒకసారి కలుస్తుంటామని తెలిపారు. ప్రతి నెల ఒకరి ఇంట్లో డిన్నర్ ఉంటుందని, కొంత అమౌంట్ పోగు చేసుకుని విదేశాలకు వెళ్లి సరదాగా గడుపుతామని చెప్పారు. ఇది కేవలం టైమ్ పాస్ కోసమేనని, ఇంట్లోనే కూర్చుని టీవీ చూస్తూ బోర్ కొట్టడం కంటే ఇలాంటి ప్రయాణాలు చేస్తామని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us