AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garividi Lakshmi OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి దసరా సూపర్ హిట్ మూవీ ‘గరివిడి లక్ష్మి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దసరాకు కానుకగా విడుదలైన ఈ బయోపిక్ సినిమా సంచలన విజయం సాధించింది. విజయ్ దేవరకొండ రణబాల, రజనీకాంత్ జైలర్ 2 సినిమాల పోటీని తట్టుకుని మరీ సాలిడ్ కలెక్షన్లు సాధించింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ సినిమాను ఎగబడి చూసేశారు

Garividi Lakshmi OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి దసరా సూపర్ హిట్ మూవీ 'గరివిడి లక్ష్మి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Garividi Lakshmi
Basha Shek
|

Updated on: Nov 25, 2026 | 12:41 PM

Share

తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘గరివిడి లక్ష్మి’. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. జైలర్ 2, రణబాలి వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ మంచి కలెక్షన్లు రాబట్టింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఈ సినిమాను ఎగబడి చూసేశారు. దర్శకుడు గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన ఈ బయోపిక్ లో ఆనంది టైటిల్ రోల్ పాత్రలో అద్బుతంగా నటించింది. అలాగే ఆమెతల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాశి తనదైన నటనతో మెప్పించారు. వీరితో పాటు రాగ్ మయూర్, నరేష్, రాశి, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కొయ్య, శరణ్య ప్రదీప్, షకలక శంకర్, కంచరపాలెం కిషోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న గరివిడి లక్ష్మి సినిమాను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది.

గరివిడి లక్ష్మి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 26 అంటే రేపు గురువారం నుంచి ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా గరివిడి లక్ష్మి సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇక గరివిడి లక్ష్మి సినిమా విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో సంచలన విజయం సాధించిన గరివిడి లక్ష్మి ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో గరివిడి లక్ష్మి

 

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us