AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 విశ్వసుందరి కిరీటం కైవసం చేసుకున్న ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో

మిస్ యూనివర్స్ 75వ ఎడిషన్ కిరీటాన్ని ప్యూర్టోరికో సుందరి జెన్నిఫర్ బారెటో (27) గెలుచుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఈ వేడుకలో విజేతగా నిలిచిన ఆమెకు గతేడాది విజేత ఫాతిమా బాష్ కిరీటాన్ని అలంకరించారు. దీంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరోసారి ఈ కిరీటం చేరింది.

2026 విశ్వసుందరి కిరీటం కైవసం చేసుకున్న ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో
Jennifer Barreto
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2026 | 11:40 AM

Share

ప్రపంచ అందాల పోటీల చరిత్రలో మరో కొత్త అధ్యాయం. మిస్ యూనివర్స్ 75వ ఎడిషన్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో దక్కించుకున్నారు. సొంతగడ్డపై అట్టహాసంగా జరిగిన ఈ ఫైనల్స్ లో విజేతగా నిలిచిన జెన్నిఫర్‌కు, గతేడాది విజేత మెక్సికో సుందరి ఫాతిమా బాష్ కిరీటాన్ని అలంకరించారు. తాజా విజయంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరోసారి విశ్వసుందరి కిరీటం చేరడం విశేషం. శాన్ సెబాస్టియన్ తరఫున బరిలోకి దిగిన జెన్నిఫర్ మొదటి నుంచే తన ఆత్మవిశ్వాసంతో జడ్జ్లను ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్ సుందరి మెలిసా నునెజ్ మొదటి రన్నరప్‌గా నిలవగా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.  చివరి ఐదుగురు ఫైనలిస్టుల జాబితాలో ప్యూర్టోరికో, డొమినికన్ రిపబ్లిక్, వెనిజులా దేశాలతో పాటు ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ సుందరీమణులు పోటీపడ్డారు.

తుది రౌండ్‌లో ఫైనలిస్టులందరికీ “ప్రస్తుతం ప్రపంచానికి తన నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటి?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి జెన్నిఫర్ బారెటో ఎంతో పరిణతితో సమాధానమిచ్చి విజేతగా నిలిచారు. “ప్రపంచానికి ప్రస్తుతం వృత్తిపరమైన సొంత అనుభూతి కలిగిన నాయకులు ఎంతో అవసరం. ఇతరులను తరచూ అంచనా వేసి ప్రశ్నించే సమాజంలో మనం ఉన్నాం. కానీ ఒక నిజమైన నాయకుడు తన విలువల కోసం నిలబడాలి, అందరికీ ఆదర్శంగా ఉంటూ ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి” అని ఆమె పేర్కొన్నారు.

జెన్నిఫర్ బారెటో కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా తన ప్రతిభతో రాణిస్తున్నారు. వివాహిత అయిన ఆమెకు ఏడేళ్ల కుమార్తె పెనెలోప్ ఉంది. ఒకవైపు మాతృత్వపు బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు వృత్తిపరమైన లక్ష్యాలను అందుకుంటూ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న అరుదైన విజేతగా జెన్నిఫర్ నిలిచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us