AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె నయనతార కాదురా అయ్యా.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

22ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అందాల ముద్దుగుమ్మ నయనతార. కెరీర్ బిగినింగ్ లో చంద్రముఖి, గజినీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా మారి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇండస్ట్రీని ఏలుతున్న ఈ అమ్మడు ఫ్యాన్స్ చేత లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటుంది.

ఆమె నయనతార కాదురా అయ్యా.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Nayanthara
Rajeev Rayala
|

Updated on: Nov 25, 2026 | 10:58 AM

Share

సోషల్ మీడియాలో ఏ క్షణాన ఏది ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార పేరు మరోసారి మారుమోగిపోతోంది. అయితే ఈసారి ఆమె కొత్త సినిమా అప్‌డేట్ వల్ల కాకుండా, అచ్చం ఆమెను పోలిన మరో మహిళ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే ఇందుకు కారణం. తొలి చూపులో సాక్షాత్తూ నయనతారేనా అని భ్రమపడేంతగా ఆ పోలికలు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో చిన్న పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలను చిరునవ్వుతో ఆస్వాదిస్తూ నిలబడి ఉన్న ఓ మహిళ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలోని ఆమె కళ్లు, ముక్కు, చిరునవ్వు, జుట్టు ముడివేసుకున్న తీరు అచ్చం నయనతారనే తలపిస్తున్నాయి. దీంతో ఇది నయనతార పాత వీడియో అని పొరబడిన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు, షేర్లు చేయడం మొదలుపెట్టారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఉన్నది నయనతార కాదు; ఆమె పేరు దీప్తి కళ్యాణి. కేరళకు చెందిన దీప్తి కళ్యాణి ప్రముఖ ట్రాన్స్‌జెండర్ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ మరియు నటి. తన ప్రతిభతో మలయాళ ఇండస్ట్రీతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజా మాల్ వీడియో వైరల్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా దక్షిణాది సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెటిజన్లు ఆమెను ‘జూనియర్ నయనతార’, ‘నయనతార ట్విన్’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us