AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishwak sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్‌ పట్టుకుని పైకి లాగింది ఆయనే.. హీరో విశ్వక్ సేన్ ఎమోషనల్

చాలా తక్కువ గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించాడు మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్. కొద్ది రోజుల క్రితమే కల్ట్ సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో రీసెంట్ గా ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

Vishwak sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్‌ పట్టుకుని పైకి లాగింది ఆయనే.. హీరో విశ్వక్ సేన్ ఎమోషనల్
Vishwak Sen
Basha Shek
|

Updated on: Nov 25, 2026 | 10:24 AM

Share

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన నటించిన లేటెస్ట్ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది 2 ‘(ఈఎన్ఈ రిపీట్). గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.50 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. దీంతో మేకర్స్ మంగళవారం (నవంబర్ 24) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశ్వక్ సేన్. ఇదే క్రమంలో కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ‘నేను 17 ఏళ్ల వయసులో ఉండగానే స్టూడియోల చుట్టూ తిరిగేవాడిని. ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలేసే వాడిని కాదు. అలా స్టూడియోల చుట్టూ నాలుగేళ్ల తిరిగాను. ఎలాంటి పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. అలా నా దగ్గర పైసల్లేవని.. 21 ఏళ్లకే నా గర్ల్‌ఫ్రెండ్‌ కూడా వదిలేసి వెళ్లిపోయింది. ఒక సినిమాలో నన్ను మెయిన్ హీరో అని చెప్పి చివరికీ తీసేశారు. మొదటి నెల ఫస్ట్ హీరోను చేశారు. ఆ తర్వాత రెండో నెల సెకండ్ హీరో.. మూడో నెలకు థర్డ్ హీరోను.. చివరికీ నాలుగో హీరోను చేశారు. కానీ చివరికీ ఆ సినిమాలో నేను లేనని కూడా చెప్పేశారు. నన్ను తీసేశారని 20 రోజులు ఆలస్యంగా చెప్పారు’

‘ తరుణ్ భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కాలేజీ రోజుల్లో నాతో గొడవపడిన ఓ వ్యక్తి.. ఆడిషన్స్‌లో అవకాశం రాకపోవడంతో నాపై కక్ష పెంచుకున్నాడు. ఓ అమ్మాయి పేరుతో నకిలీ జీ మెయిల్‌ ఖాతా సృష్టించి తరుణ్‌ భాస్కర్‌కు బెదిరింపు మెయిల్‌ పంపించాడు. ఆ మెయిల్‌ చూసిన తరుణ్‌ భాస్కర్‌ మొదట తనను సినిమా నుంచి తప్పించాడు. అయితే ఈ విషయంపై తర్వాత భాస్కర్‌తో మాట్లాడాను. ‘నాకు సినిమా వద్దు. కానీ ఆ మెయిల్‌ నాకు పంపించు. నేను నిర్దోషినని నిరూపించుకుంటాను అని అడిగాను. ఆ రోజు తరుణ్‌ నా మాట నమ్మి మెయిల్‌ పంపించారు. కేవలం 24 గంటల్లోనే అది ఓ వ్యక్తి చేసిన నకిలీ పని అని తేలిపోయింది. ఆ రోజు తరుణ్ భాస్కర్‌ నా మాట నమ్మకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తెలీదు. పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్‌ పట్టుకుని పైకి లాగింది తరుణ్‌ భాస్కరే. నా కన్నతల్లిదండ్రులు, మా అక్క నాకు 50 శాతం సంస్కారం నేర్పిస్తే.. మిగిలిన 50 శాతం తరుణ్‌ దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నా రక్తసంబంధం లాంటి సోదరుడు’’ అంటూ విశ్వక్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

తరుణ్ భాస్కర్ గురించి విశ్వక్ సేన్ మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us