AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధార్ కార్డు ఉంటే చాలు.. నెలకు రూ.3 వేలు పొందోచ్చు.. జస్ట్ ఈ పని చేయండి..

PM LVMDY :కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. జస్ట్ ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అసలు ఈ పథకం ఏంటి.. ఎలా లబ్ది పొందాలనేది చూద్దాం.

ఆధార్ కార్డు ఉంటే చాలు.. నెలకు రూ.3 వేలు పొందోచ్చు.. జస్ట్ ఈ పని చేయండి..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Nov 25, 2026 | 10:06 AM

Share

దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన (PM-LVMDY)పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్, షాప్‌కీపర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ పేరుతో 2019 సెప్టెంబర్ 12 నుంచి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు 60 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు. పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసే వారికి లభించే పెన్షన్ ప్రయోజనాలను చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కూడా అందించేందుకు కేంద్రం దీనిని ప్రవేపెట్టింది. పూల దుకాణం, పండ్ల దుకాణం, కిరాణా కొట్లు, చిన్న హోటల్స్, రెస్టారెంట్లు, వర్క్‌షాప్‌లు, బట్టల దుకాణాలు వంటి రిటైల్ వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు వంటి స్వయం ఉపాధి పొందే వారు ఈ పథకంలో చేరి లబ్ది పొందవచ్చు.

అర్హతలు ఇవే..

-దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి

-వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు

-ఆదాయపు పన్ను చెల్లించే వారై ఉండకూడదు

-EPFO, ESIC,NPS, ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన వంటి ఇతర పెన్షన్ లేదా సామాజిక భద్రతా పథకాలలో సభ్యులుగా ఉండకూడదు

రూ.3 వేల పెన్షన్ పొందటం ఎలా..?

60 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత నెలకు రూ. 3 వేల స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో ఆర్థిక స్థిరత్వాన్ని, భద్రతను అందిస్తుంది. అయితే దరఖాస్తుదారులు తక్కువ మొత్తంలో ప్రతీ ఏటా కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అందుకు సమానంగా కేంద్రం మరికొంత జమ చేస్తుంది. 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే.. వారి జీవిత భాగస్వామికు పెన్షన్ అందిస్తారు. పెన్షన్‌లో 50 శాతం వరకు పొందుతారు.పథకంలో చేరిన వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు నిండకముందే మరణిస్తే, వారి జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. అలాగే నిలిపివేసి జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా పొందవచ్చు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ పత్రాలు దరఖాస్తు చేసుకోవడం అవసరం. ఆన్‌లైన్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవడం లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా చేయవచ్చు. ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, సూచనలను పాటించాల్సి ఉంటుంది.

ఈ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి..?

చిన్న వ్యాపారులు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. కుటుంబ పెన్షన్ ద్వారా జీవిత భాగస్వామికి భద్రత లభిస్తుంది. వృద్దాప్యంలో పనిచేయడానికి వయస్సు సహకరించదు. ఇలాంటి సమయంలో ఈ పెన్షన్ ద్వారా తమ ఆర్ధి అవసరాలను తీర్చుకోవచ్చు.

Follow Us