Jabardasth Dhanraj: అప్పుడు ఫ్యామిలీని పోషించడం కష్టమైంది.. ఆ స్టార్ హీరో వెంటనే చెక్ రాసి చేతిలో పెట్టారు
జబర్దస్త్ కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనాధన్ ధన్ రాజ్ ఒకరు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలాగే రామం రాఘవం సినిమాతో డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ధనరాజ్.

ధనాధన్ ధన్ రాజ్.. చూడడానికి బక్కగా ఉన్నా ఆడియెన్స్ ను గట్టిగా నవ్విస్తుంటాడీ టాలీవుడ్ కమెడియన్. కెరీర్ ప్రారంభంలో పలు పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ, జగడం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు ధన్ రాజ్. హీరో ఫ్రెండ్ పాత్రల్లో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఈ క్రేజ్ తోనే జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడు. తన ట్యాలెంట్ తో, కామెడీ టైమింగ్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. ‘ధనా ధన్ ధన్‌రాజ్’ పేరుతో ఇతను చేసే కామెడీ స్కిట్లకు చాలా మంది అభిమానులు ఉన్నారు. యూట్యూబ్ లోనూ ఈ కమెడియన్ స్కిట్లకు భారీగా వ్యూస్ వస్తుంటాయి. బుజ్జి ఇలారా వంటి సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్న ధన్‌రాజ్ రామం రాఘవం సినిమాతో డైరెక్టర్ గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం టీవీ షోల్లోనే కాదు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు ధన్‌రాజ్. ఇప్పుడంటే బాగుంది కానీ కెరీర్ ప్రారంభంలో ధన్ రాజ్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా పెళ్లి అయిన తర్వాత ఫ్యామిలీని పోషించడానికి చాలా ఇక్కట్లు పడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ టాలీవుడ్ హీరో, పాన్ ఇండియా డైరెక్టర్ తనను ఆదుకున్నారని ఎమోషనల్ అయ్యాడీ జబర్దస్త్ కమెడియన్.
‘పెళ్లి తర్వాత నాకు ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. ఫ్యామిలీని పోషించడం కష్టమైపోయింది. దీంతో ఎవరినైనా హెల్ప్ అడగాలనుకున్నా. ఆ సమయంలో నేరుగా హీరో రామ్ దగ్గరకు వెళ్లి సాయం అడిగా. ఆయన వెంటనే 10 వేల రూపాయల చెక్ రాసి ఇచ్చారు. అప్పుడు జగడం సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో 10 వేలు అంటే నాకు 10 లక్షలతో సమానం. డబ్బు ఇచ్చాక రామ్ గారు నాతో ఒకే మాట అన్నారు. 10 వేలు మాత్రమే కాదు.. నీకు ఎలాంటి సాయం కావాలన్నా సిగ్గులేకుండా నన్ను అడగమన్నారు. రామ్ తర్వాత సినిమా ఇండస్ట్రీలో నన్ను ఆదుకున్న మరో వ్యక్తి డైరెక్టర్ సుకుమార్ గారు. ఒక సారి ప్రసాద్ లాబ్స్ లో ఆయనను కలిశాను. అప్పటికీ నేను బాగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని ఆయనకి తెలుసు. వెంటనే తన జేబులో ఎంత డబ్బు ఉందో కూడా లెక్కపెట్టకుండా నాకు ఇచ్చేశారు. ఆ డబ్బుతో ఇంట్లో అందరికీ మంచి బట్టలు ఇంకా అవసరమైనవి కొనుక్కుని వెళ్లు అని చెప్పారు. వాళ్లు నాపై చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పటికీ నేను పెద్ద స్టార్ ను కూడా కాదు. వాళ్లు నాపై కేర్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. అయినా నన్ను ఆదుకున్నారు. అందుకే ఎలాగైనా సుకుమార్, రామ్ ఇద్దరి రుణం తీర్చుకోవాలనుకున్నా. సరిగ్గా ఆ టైంలోనే నాకు కొడుకు పుట్టాడు. 21 రోజుల తర్వాత సుకుమార్, రామ్ పేర్లు కలిసి వచ్చేలా మా బాబుకి సుఖ్ రామ్ అని పేరు పెట్టాను’ అని ధన్ రాజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Sukumar, Ram Pothineni
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




