టాలెంట్‌కు తోడు హార్డ్‌వర్క్.. అమెజాన్‌లో రూ.46 లక్షల ప్యాకేజీ కొట్టేసిన తెలుగు అమ్మాయి!
గుంటూరు వీవీఐటీకి చెందిన వరలక్ష్మీ ప్రసన్న అమెజాన్‌లో రూ.46 లక్షల వార్షిక వేతనంతో డేటా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అద్భుత విజయం సాధించారు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆమె, అంకితభావం, నిరంతర శ్రమ, సాంకేతిక నైపుణ్యాలతో తన కలను నిజం చేసుకున్నారు. డీఎస్ఏ (డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్), ఎస్‌క్యూఎల్ వంటి కీలక నైపుణ్యాలపై దృష్టి సారించడం ద్వారా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. అసాధారణ విజయాన్ని అందుకుంది. కోడింగ్‌పై పట్టు, నేర్చుకోవాలనే తపన, కాస్త ధైర్యం.. ఇవే ఆమె సక్సెస్ మంత్ర. గుంటూరు వీవీఐటీ విద్యార్థిని చున్నమల్లు వరలక్ష్మీ ప్రసన్న ఏకంగా అమెజాన్‌లో ఏడాదికి రూ.46 లక్షల ప్యాకేజీతో డేటా ఇంజినీర్‌గా జాబ్ కొట్టేశారు. పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుందో లేదో అని మొదట సందేహపడిన ఆమె.. ఇప్పుడు ఎంతోమంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. మరి ఆమె ఈ జర్నీలో ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి? తెలుసుకుందాం.
డౌట్‌తో మొదలై.. డ్రీమ్ జాబ్ వరకు!
బీటెక్ చదివే చాలామంది స్టూడెంట్స్‌కు అమెజాన్, గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో జాబ్ కొట్టాలనేది డ్రీమ్. వరలక్ష్మీ ప్రసన్న కూడా అలాంటి కలే కన్నారు. అయితే, అమెజాన్‌లో ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదని, తన కోడింగ్ స్కిల్స్ సరిపోతాయో లేదోనని మొదట కొంత వెనకడుగు వేశారు.
కానీ ఆమె అన్న చంద్రశేఖర్ పవన్ కుమార్ ఇచ్చిన సపోర్ట్ ఆమె ఆలోచనను మార్చేసింది. “ముందు ఒక స్టెప్ ముందుకెయ్యి.. ట్రై చేస్తూ ఉండు. వస్తే వచ్చింది.. లేదంటే ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది” అన్న ఆయన మాటలు ప్రసన్నలో కాన్ఫిడెన్స్ నింపాయి. దీంతో రిస్క్ తీసుకుని అమెజాన్‌కు అప్లై చేశారు. ఆ ఒక్క నిర్ణయమే ఆమె కెరీర్‌ను కొత్త మలుపు తిప్పింది.
ఇంటర్వ్యూలో అసలైన టాస్క్ ఇదే!
అక్టోబర్ 4న అమెజాన్‌కు అప్లై చేసిన ప్రసన్నకు మొదట ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వచ్చింది. దాన్ని క్లియర్ చేయడంతో అక్టోబర్ 30న హైదరాబాద్‌లో పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఇందులో రెండు టెక్నికల్ రౌండ్లు, బిహేవియరల్ ప్రశ్నలు ఉన్నాయి.
ఫస్ట్ టెక్నికల్ రౌండ్:
SQL, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ (DSA)పై ప్రశ్నలు అడిగారు.
తన ప్రాజెక్టులకు సంబంధించిన SQL క్వెరీస్, డేటా ఇంజినీరింగ్ ఫండమెంటల్స్‌పై ప్రశ్నలు వచ్చాయి.
DSAలో ఒక మీడియం లెవల్, మరో హార్డ్ లెవల్ ప్రాబ్లమ్ ఇచ్చారు.
Maximum Sequence in Array List, Grouping Anagrams వంటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
హార్డ్ లెవల్ ప్రశ్నను పూర్తిగా సాల్వ్ చేయడంలో కొంత ఇబ్బంది ఎదురైనా, తన ఆలోచనా విధానాన్ని, సొల్యూషన్ అప్రోచ్‌ను వివరించి ఇంటర్వ్యూయర్లను ఇంప్రెస్ చేశారు.
సెకండ్ టెక్నికల్ రౌండ్:
ఈ రౌండ్లో ప్రశ్నలు మరింత డీప్‌గా ఉన్నాయి. అడ్వాన్స్డ్ SQL క్వెరీస్, ప్రాజెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో పాటు రియల్ టైమ్ సినారియో ఇచ్చి, దానికి అనుగుణంగా SQL క్వెరీస్ ఎలా రాస్తారో అడిగారు. డేటా ఇంజినీరింగ్ ఫండమెంటల్స్పైనా ప్రశ్నలు వచ్చాయి. చివరగా బిహేవియరల్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
సక్సెస్ వెనుక కాలేజీ ట్రైనింగ్.. ఫ్యామిలీ సపోర్ట్!
ఈ సక్సెస్‌లో కాలేజీ ట్రైనింగ్ కూడా కీలక పాత్ర పోషించింది. వీవీఐటీలో 3-2 సెమిస్టర్ నుంచే ‘స్మార్ట్ ఇంటర్వ్యూస్’ పేరుతో DSA ట్రైనింగ్ ఇచ్చారు. మనీ శంకర్ సర్ చెప్పిన కాన్సెప్ట్స్, ఒకే ప్రాబ్లమ్‌ను వివిధ పద్ధతుల్లో ఎలా సాల్వ్ చేయాలో నేర్పిన విధానం తనకు బాగా ఉపయోగపడ్డాయని ప్రసన్న తెలిపారు. ఆ క్లాసుల్లో రాసుకున్న నోట్స్‌నే ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు బేస్‌గా చేసుకున్నారు. అమెజాన్‌కు సెలెక్ట్ అయిన తర్వాత కూడా కాలేజీ రెండు, మూడు రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది.
ఇక ఆమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఈ విజయం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. నాన్న హాస్టల్ సూపర్వైజర్గా పనిచేస్తుండగా, అమ్మ టైలరింగ్ చేస్తారు. అన్నయ్య ఆస్ట్రాల్ అడెసివ్స్లో సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ప్రసన్న చెబుతున్నారు. ఆమె గుంటూరులోనే పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
జాబ్ కొట్టాలంటే ఈ స్కిల్స్ తప్పనిసరి!
యువతకు ప్రసన్న ఇచ్చే సలహా చాలా సింపుల్. ఏ టెక్నికల్ రోల్‌కు అప్లై చేసినా DSAపై మంచి పట్టు ఉండాలి. కోడింగ్ ఇంటర్వ్యూలలో ఇది చాలా కీలకం. DSAతో పాటు తాము ఎంచుకున్న జాబ్ రోల్‌కు అవసరమైన స్పెసిఫిక్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. తనకు డేటా ఇంజినీర్ రోల్‌పై ఆసక్తి ఉండటంతో ఆ రంగానికి సంబంధించిన అడ్వాన్స్డ్ SQL, డేటా ఇంజినీరింగ్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలిపారు.
“ఏదైనా సాధించాలంటే ముందు ట్రై చేయాలి. మనకు రాదేమోనని ముందే వెనకడుగు వేయకూడదు” అన్నట్లుగా ప్రసన్న ప్రయాణం యువతకు ఒక మంచి మెసేజ్ ఇస్తోంది. టాలెంట్‌కు సరైన స్కిల్స్, కష్టానికి పట్టుదల తోడైతే పెద్ద కంపెనీల్లో భారీ ప్యాకేజీలు సాధించడం అసాధ్యమేమీ కాదని ఆమె నిరూపించారు. భవిష్యత్తులో ఇంతకంటే మెరుగైన అవకాశాలు వచ్చినా తన బెస్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రసన్న చెబుతున్నారు.
