AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీమార్ట్‌లోని వస్తువులు తక్కువ ధరకే ఎలా వస్తాయి..? చాలామందికి తెలియని అసలు సీక్రెట్ ఇదే..

Dmart Shopping: మీరు డీమార్ట్‌కు వెళితే.. అతి తక్కువ ధరకే అన్నీ వస్తువులు లభిస్తాయి. బయట సూపర్ మర్కెట్లు, దుకాణాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ రేటుకు ప్రతీది దొరుకుతాయి. దీంతో ఇవి నాణ్యత లేని వస్తువులని చాలామంది భావిస్తారు. కానీ అవి నాణ్యమైనవే. కానీ డీమార్ట్ ఎలా తక్కువకు ఇవ్వగలుగుతుందంటే..

డీమార్ట్‌లోని వస్తువులు తక్కువ ధరకే ఎలా వస్తాయి..? చాలామందికి తెలియని అసలు సీక్రెట్ ఇదే..
Dmart
Venkatrao Lella
|

Updated on: Nov 25, 2026 | 2:18 PM

Share

డీమార్ట్ అంటే తెలియనివారు దాదాపుగా ఎవరూ ఉండరు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు అతి తక్కువ ధరకు ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు ఒకేచోట కొనుగోలు చేసేందుకు ఇక్కడిక ఎక్కువగా వెళ్తుంటారు. నెలకు ఒకసారి డీమార్ట్‌కు వెళ్లి ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. తక్కువ ధరకే వస్తువులు లభించడం వల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా ఇంటి ఖర్చు తగ్గుతుందని భావిస్తారు. వన్ ప్లస్ వన్, 50 శాతం తగ్గింపు, కాంబో ఆఫర్లు వల్ల ఆకర్షితులై ఇక్కడికి షాపింగ్ చేసేందుకు ఎక్కువమంది వెళ్తుంటారు. అయితే డీమార్ట్‌లో అంత తక్కువ ధరకు వస్తువులు ఎలా లభిస్తాయి..? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ధరల వెనుక సీక్రెట్ ఇదే..

ఇతర సూపర్ మార్కెట్లు అద్దెల కోసం అధిక అద్దెలు చెల్లిస్తుంటే.. డీమార్ట్ మాత్రం సొంత భవనాలను నిర్మించుకుని నడుపుతోంది. దాదాపు 75 నుంచి 80 శాతం స్టోర్లు సొంత భవనాల్లోనే ఉంటాయి. దీని వల్ల అద్దె ఖర్చులు మిగలడంతో..  వినియోగదారులకు డిస్కౌంట్లు ఇస్తోంది. ఇక డీమార్ట్ తమకు వస్తువులను సరఫరా చేసేవారికి కేవలం 10-15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తుంది. దీనివల్ల పెద్ద కంపెనీలు అదనంగా 3 నుంచి 5 శాతం క్యాష్ డిస్కౌంట్‌లను ఇస్తున్నాయి. అలాగే డీమార్ట్ తన షెల్ఫ్‌లలో ఉత్పత్తులను ఉంచడానికి బ్రాండ్‌ల నుండి ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తుంది. అంతేకాకుండా ఉత్పత్తులను నేరుగా ఫ్యాక్టరీల నుండి బల్క్ మొత్తంలో కొనుగోలు చేయడం ద్వారా తక్కువ ధరలకు పొందుతుంది. అలాగే డీమార్ట్ స్టోర్‌లలో ఖరీదైన ఇంటీరియర్‌లు, సంగీతం, ఎక్కువ మంది సేల్స్ బాయ్స్ లేదా టీవీ ప్రకటనలు వంటివి ఉండవు. ఈ ఖర్చులను తగ్గించుకోవడం వల్ల కస్టమర్లకు తక్కువ ధరకు వస్తువులను ఇవ్వగలుగుతుంది.

డీమార్ట్‌ వస్తువులు క్వాలిటీ ఉండవా..?

డీమార్ట్ తక్కువ ధరలకు సరుకులు అమ్ముతుండటంతో క్వాలిటీ ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ అన్నీ ఒరిజినల్‌వే.  కంపెనీలు డీమార్ట్ కోసం ప్రత్యేక ప్యాక్ సైజులు తయారుచేసి సరఫరా చేస్తాయి. ఉదాహరణకు 1 కిలో బదులు 850 గ్రాముల ప్యాక్ తరహాలోనే తయారుచేసి విక్రయిస్తాయి. అవి తక్కువ ధరలకు కనిపించినా యూనిట్ ధరలో పెద్ద తేడా ఉండదు. ఇక బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ల ద్వారా ఎక్స్‌పైరీ డేట్ దగ్గరలో ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, కిచెన్ సామాన్లు వంటి నాన్ ఫుడ్, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులు మాత్రం అన్‌బ్రాండెడ్ లోకల్ ఫ్యాక్టరీల నుండి అతి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు. ఇవి ప్రీమియం క్వాలిటీ కాకుండా బడ్జెట్ లెవల్ నాణ్యతతో ఉంటాయి. దీంతో లూస్ మసాలాలు, పప్పులు కొనేటప్పుడు ఫ్రెష్‌నెస్ చెక్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Follow Us