టీవీ9 ప్రతినిధిగా 2007లో నా మీడియా ప్రస్థానం మొదలైంది. AajTak, Ndtv లాంటి జాతీయ చానల్స్‌లో పనిచేసిన అనుభవంతో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో సంచలనాత్మక కథనాలను వెలుగులోకి తెచ్చాను. టీవీ9 తెలుగులో వివిధ హోదాల్లో రిపోర్టర్‌గా పనిచేస్తూ 2016లో సీనియర్ కరస్పాండెంట్‌గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల నుంచి టీవీ9 నెట్‌వర్క్ సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
Hyderabad: ఫ్యాన్సీ నెంబర్లతో కరెన్సీ నోట్లు.. క్రేజీ క్రేజీగా అమ్మొచ్చు, కొనొచ్చు కూడా..
మనలో చాలామందికి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అదేంటంటే.. మనం వాడే ఫోన్ నెంబర్ లేదా వెహికిల్ నెంబర్ ఇలాంటి ముఖ్యమైనవి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరి దగ్గరైనా చెప్పుకోవడానికి కానీ, లేదా మన కోసం మనం సంతృప్తి చెందడానికి ఇలాంటివి ఖచ్చితంగా పాటిస్తుంటాం.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 23, 2025
- 12:14 pm
Hyderabad: పోలీసులకు మరో సవాల్.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు.. నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం
Hyderabad: దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ఉండటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ఇంజక్షన్లను యువత మత్తుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తుందన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 21, 2025
- 9:27 pm
Hyderabad: మత్తు కోసం మెడికల్ డ్రగ్ తీసుకుని ఇంటర్ విద్యార్థి మృతి
తల్లిదండ్రులూ బీ అలర్ట్. పిల్లలపై మత్తు ముఠాలు కొత్తకొత్త మార్గాల్లో వల విసురుతున్నాయి. మార్కెట్‌లో ఈజీగా దొరికే పెయిన్ కిల్లర్స్‌నే మత్తుమందుగా మార్చేస్తూ..విద్యార్ధులను, యువకులను బానిసలుగా మార్చేస్తున్నాయి. హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఓ ఘటన పిల్లల తల్లిదండ్రులతో పాటు పోలీసులను కూడా కలవర పెడుతోంది.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 21, 2025
- 8:58 pm
Hyderabad: కల్తీ ఇంజిన్ ఆయిల్‌కి పెద్ద కంపెనీ స్టిక్కర్! వామ్మో ఇది మామూలు మోసం కాదు రా స్వామి..! ఎక్కడో తెలుసా..
హైదరాబాద్ పోలీసులు నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ, అమ్మకాలలో పాల్గొన్న నిందితుడిని అరెస్టు చేశారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ దాడిలో 710 లీటర్ల నకిలీ కాస్ట్రోల్ ఇంజిన్ ఆయిల్, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 3 లక్షలు. నిందితుడు కాస్ట్రోల్ లేబుల్స్‌ను ఉపయోగించి నకిలీ ఆయిల్‌ను తయారు చేసి, తక్కువ ధరకు విక్రయించాడు.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 20, 2025
- 9:59 pm
Telangana: ప్రమాదంలో గాయపడ్డ కొండముచ్చు.. సపర్యలు చేసిన ప్రతి ఒక్కరికి వేల వేల వందనాలు
ఈ రోజుల్లో మనుషులకు ప్రమాదం జరిగి చావుబ్రతుకుల్లో ఉంటేనే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకొందరు అయితే తీరిగ్గా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. అయితే ఇక్కడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ కొండముచ్చుకు సపర్యలు చేసి మానవత్వం చాటుకున్నారు కొందరు వ్యక్తులు. వివరాలు ఇలా ఉన్నాయి..
- Noor Mohammed Shaik
- Updated on: Apr 19, 2025
- 12:42 pm
Hyderabad: పక్కింటివారితో చిన్న వివాదం.. పరస్పరం దాడి చేసుకున్న రెండు ఫ్యామిలీలు!
కొన్ని సార్లు చిన్న చిన్న గొడవలే చిలికిచిలికి పెద్ద వివాదంగా మారుతాయి. ఇలానే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్-ముషీరాబాద్ ప్రాంతంలో పక్కింటి వారితో ఓ విషయంలో మొదలైన చిన్న గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు వెళ్లింది. ఈ గొడవ ఘర్షణలకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే..
- Noor Mohammed Shaik
- Updated on: Apr 19, 2025
- 11:45 am
Telangana: పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. బామ్మర్ది హత్యకు మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..
సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. నా అనేవాళ్ళే డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం సొంత బామ్మర్దినే చంపేందుకు ప్రయత్నించాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ నగరంలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 17, 2025
- 9:32 pm
Hyderabad: ప్లాట్ విషయంలో ఇరువర్గాల దాడి.. విచక్షణారహితంగా కర్రలు, బండలతో కొడుతూ..
ప్రస్తుతం వీరయ్యకు చికిత్స కొనసాగుతోంది. అసలు ప్లాట్ విషయంలో ఇంతలా కొట్టుకునేవరకూ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై పూర్తి సమాచారం లేదు. ఈ విషయమై ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కర్రలు, బండలతో దాడి చేస్తూ కొందరు యువకులపై పిడిగుద్దులతో కొడుతూ తీవ్రంగా గాయపరిచారు. గొడవ ఆపడానికి అడ్డుగా వచ్చిన మహిళలపై కూడా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 17, 2025
- 9:18 pm
Hyderabad: బ్యాంకాక్ టూ హైదరాబాద్.. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఓ విమానం వచ్చి ల్యాండ్ అయింది. ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు అవుట్ పాయింట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు. వారి కదలికలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 16, 2025
- 6:32 pm
వీళ్ళు మనుషులేనా.. మానవ మృగాలా.. నడిరోడ్డుపై మహిళపై అత్యంత పాశవికంగా..!
మహిళ అనే కనికరం ఏమాత్రం లేదు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అమానుషంగా దాడి చేశారు. ఒంటరి మహిళను చేసి ఏకంగా ఆరుగురు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అది కూడా అత్యంత పాశవికంగా తాలిబనీ శైలిలో దాడికి దిగడం గమనార్హం. చుట్టూ ఉన్నవాళ్లు ఈ ఘోరకలిని చూస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరులో.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 15, 2025
- 6:07 pm
Hyderabad: టోల్ టాక్స్ కట్టమన్నందుకు సిబ్బందికి చుక్కలు చూపించిన సర్కార్ ఉద్యోగి..!
ప్రభుత్వ అధికారిని అనే ఒకే ఒక్క హోదా చూసుకుని టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ పెద్ద మనిషి. అధికారం ఉందనే గర్వమో.. లేక ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయమో తెలియదు గానీ, టోల్ మినహాయింపు ఇవ్వాలని అడగడమే కాకుండా ఇవ్వనందుకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 15, 2025
- 5:45 pm
Hyderabad: పైశాచికం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్స్
మనిషి కిరాతకం ఇలా కూడా ఉంటుందా? పైశాచిక ఆనందం ఈ స్థాయిలో ఉంటుందా? ఈ ఘటన చూస్తే.. మనకు ఇలాంటి సందేహాలు రాక తప్పదు. హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన దారుణ ఘటన గురించి తెలిస్తే మీకు కూడా ఈ సమాజం పట్ల జుగుప్ప కలుగుతుంది.
- Noor Mohammed Shaik
- Updated on: Apr 15, 2025
- 9:31 am