FASTag: ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) షాకిచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచింది. తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర రూ.3,075గా ఉండనుంది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) షాకిచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రూ.3,000లుగా ఉన్న వార్షిక పాస్ ధరపై 2.5 శాతం మేర పెంచింది. తాజా పెంపుతో ఇకపై వార్షిక పాస్ ధర రూ.3,075గా ఉండనుంది. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 31 లోగా రీఛార్జ్ చేసుకుంటే మాత్రం ప్రస్తుత ధరలే వర్తిస్తాయి. అంటే రూ.3,000లకే ఇయర్ పాస్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒక సంవత్సర కాలం లేదా 200 టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం.. హైవే టోల్ ధరల వార్షిక సవరణలో భాగంగా ఈ ధరలను పెంచింది ఎన్‌హెచ్‌ఏఐ. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ విధానానికి వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు సుమారు 52 లక్షల మందికిపైగా వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మహిళా సాధికారతకు బాటలు వేస్తూ, టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున మహిళా ఉద్యోగులను నియమించనుంది NHAI. దేశవ్యాప్తంగా ఉన్న 1,140కి పైగా టోల్ ప్లాజాల వద్ద సుమారు 5,100 మంది మహిళలను పగటిపూట షిఫ్టుల్లో నియమించనున్నారు. సాధారణంగా టోల్ ప్లాజాలలో సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య వాగ్వాదాలను తగ్గించడానికి ఈ నిర్ణంయ తీసుకున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టోల్ బూత్‌ల వద్ద మహిళా సిబ్బంది ఉండటం వల్ల వాహనదారులకు మరింత మర్యాదపూర్వకమైన సేవలు అందుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..
గ్యాస్ వినియోగదారులకు షాక్.. వారికి నో బుకింగ్.. నో సిలిండర్
మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

