AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

Mushroom: పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి..

Phani CH
|

Updated on: Mar 18, 2026 | 1:55 PM

Share

ప్రస్తుతం పుట్టగొడుగులు 'వెజ్ మీట్'గా ప్రాచుర్యం పొందాయి, ప్రోటీన్లు, విటమిన్లతో నిండి ఉన్నాయి. అయితే, పుట్టగొడుగులను వండేటప్పుడు కాండాలను తొలగించకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా షిటాకే వంటి రకాలలో గట్టి కాడలు సరిగా ఉడకవు, అజీర్ణం, ఉబ్బరం కలిగిస్తాయి. కాడలు తీసేస్తే వంట రుచికరంగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది.

ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో ఎక్కడ చూసినా పుట్టగొడుగులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇవి ‘వెజ్ మీట్’గా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పుట్టగొడుగులను వండుకునే క్రమంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు జీర్ణ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది పుట్టగొడుగులను కడిగి మొత్తం వండేస్తుంటారు. కానీ, పుట్టగొడుగుల కాండం భాగాన్ని, ముఖ్యంగా ‘షిటాకే’ వంటి రకాల్లో ఉండే కాండాన్ని తొలగించడం మంచిది. ఈ కాండం భాగం చాలా గట్టిగా, పీచులా ఉంటుంది. దీన్ని ఎంతసేపు ఉడికించినా మెత్తబడదు. ఇలాంటి గట్టి భాగాన్ని తినడం వల్ల జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుంది. దాంతో అది సరిగా అరగదు. పుట్టగొడుగుల కాండం సరిగ్గా అరగకపోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి గొంతు నొప్పికి లేదా అసౌకర్యానికి కారణం కావచ్చని పరిశోధనల్లో తేలింది. అందుకే, పుట్టగొడుగులను వంట చేసేముందు కాడలను వేరు చేసి, కేవలం పైభాగాన్ని మాత్రమే వాడుకోవడం వల్ల వంటకు మంచి రుచి రావడమే కాకుండా సులభంగా జీర్ణమవుతుంది. పుట్టగొడుగులు కొనేటప్పుడు అవి తాజాగా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ వాటిపై బూజు పట్టినట్లుగా ఉన్నా లేదా నల్లటి మచ్చలు ఉన్నా వాటిని వాడకూడదు. వండే ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కాండం భాగాన్ని తొలగించి వండుకోవడం ఉత్తమం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌

మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు

ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

Follow Us