గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన LPG కొరత రెస్టారెంట్లను మూసివేసింది. కేరళ టెక్కీలు వైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త 'గ్యాస్ అన్‌డూ' వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఇది కొచ్చిలోని రెస్టారెంట్ల ఆహార లభ్యతను నిజ సమయంలో చూపుతుంది. కస్టమర్ల భాగస్వామ్యంతో పనిచేసే ఈ మ్యాప్, ఆహారం కోసం ప్రజల ఇంధనం, సమయం వృథాను నివారిస్తుంది, సాంకేతికతతో సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది.
పశ్చిమాసియా సంక్షోభం సెగ వంట గదులనూ తాకింది. ఎల్‌పీజీ కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. కేరళలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో యే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? ఆ వివరాలను ఇట్టే చెప్పే ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం దొరకలేదు . గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్‌డూ’ ‘ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ఒక డిజిటల్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ లో ప్రస్తుతం ఏ ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? ఆ వివరాలను రియల్ టైమ్‌లో ఈ వెబ్‌పసైట్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ఈ వెబ్‌సైట్ పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. హోటల్‌కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్‌లో అప్‌డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్‌కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..
సిలిండర్ కోసం 'చెప్పుల' క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా

