కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
యాదాద్రి భువనగిరిలోని తుక్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తల్లి నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో 14 ఏళ్ల కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. దాడి అనంతరం తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించగా, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కని పెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కాలయముడిలా మారింది. మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి, నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో దాడి చేసిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని తుక్కాపురంలో కలకలం రేపింది. ఈ దాడిలో 14 ఏళ్ల కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుమారుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. జైనపల్లి గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి, నీలిమ దంపతులకు కృతిక , అక్షిత్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా నీలిమ మానసిక సమస్యలతో బాధపడుతోంది. శనివారం సాయంత్రం భర్త ఆమెను, పిల్లలను తీసుకువచ్చి తుక్కాపురంలోని పుట్టింట్లో విడిచి వెళ్ళాడు. అంతా సజావుగానే ఉందనుకుంటున్న సమయంలో, తెల్లవారుజామున నీలిమ కత్తితో పిల్లలపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ క్రమంలో కూతురు కృతిక తీవ్ర గాయాలతో మృతి చెందగా, కుమారుడు అక్షిత్ అప్రమత్తమై బయటకు పరుగెత్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. పిల్లలపై దాడి చేసిన అనంతరం నీలిమ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలిమ పిల్లల విషయంలో అతిగా ప్రవర్తించేదని, ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలని మొండిపట్టు పట్టడం, ఇంకా అనేక రకాలుగా పిల్లలు ఇబ్బంది పడేవారని బంధువులు తెలిపారు. మతిస్థిమితం కోల్పోవడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడిందని సోదరుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు
దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..
Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్ టౌన్’గా మారిన దుబాయ్.. మొత్తం గంగార్పణం
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!

