దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..
అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు ఘోర విషాదానికి కారణమైంది. గాలి, వెలుతురు లేని గదిలో బైక్ రాత్రంతా ఆన్ చేసి ఉంచడంతో, నిద్రిస్తున్న తాతతో పాటు ముగ్గురు పసిప్రాణాలు బలి అయ్యాయి. ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబంలో నలుగురిని బలితీసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
చిన్నపాటి నిర్లక్ష్యం ఒక నిండు కుటంబంలో చిచ్చు పెట్టింది. బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన విషవాయువు పసి ప్రాణాలను బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిద్రిస్తున్న స్థితిలోనే తాతతో పాటు ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా మారడం అందరినీ కదిలించివేసింది. స్థానిక త్యాగరాజు వీధిలో సెలూన్ షాపు నడుపుకుంటూ మురళి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల తన మోటార్ బైక్ రిపేరుకు రావడంతో మెకానిక్ వద్ద బోర్ చేయించాడు. ఇంజిన్ కొత్తగా బోర్ చేయడంతో, రాత్రంతా ఇంజిన్ రన్నింగ్‌లో ఉంచితే ‘కూలింగ్’ అవుతుందని మెకానిక్ సూచించాడు. మెకానిక్ మాటను గుడ్డిగా నమ్మిన మురళి, రాత్రి తన ఇంటి లోపలే బైక్ స్టార్ట్ చేసి రన్నింగ్‌లో ఉంచాడు. మురళి తన భార్యతో కలిసి ఇంటి మిద్దెపై పడుకోగా, కింద గదిలో అతని తండ్రి రామచంద్రయ్య, కొడుకు కార్తీక్, కవలలైన చరిత, చందన నిద్రపోయారు. ఆ ఇల్లు ఇరుకుగా ఉండటం, కిటికీలు లేకపోవడంతో బైక్ ఇంజిన్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ గది నిండా అలుముకుంది. గాఢ నిద్రలో ఉన్న వారు ఆ పొగను పీల్చడంతో ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఉదయం చూసేసరికి నలుగురు విగతజీవులుగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో రామచంద్రయ్యతో పాటు ముగ్గురు పసిపిల్లలు ఉండటం చూపరులను కన్నీరు పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేషన్ లేని గదిలో రాత్రంతా బైక్ ఆన్ చేసి ఉంచడమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఆ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్ టౌన్’గా మారిన దుబాయ్.. మొత్తం గంగార్పణం
భూగర్భంలో ఇరాన్ ‘మిస్సైల్ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు
షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్ సెగలు’.. ఎందుకంటే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

