AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!

యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!

Phani CH
|

Updated on: Mar 17, 2026 | 6:38 PM

Share

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య భీకర యుద్ధం రెండు వారాలు దాటింది. ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా సెజ్జిల్ వంటి అత్యాధునిక క్షిపణులతో ప్రతిఘటిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెజ్జిల్-2, 2000 కి.మీ. పరిధితో, ఐరన్ డోమ్‌ను తప్పించే సామర్థ్యంతో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఖమేనీ మరణం తర్వాత బలహీనపడిందనుకున్న ఇరాన్, అనూహ్య ప్రతిఘటనతో ట్రంప్, నెతన్యాహులను ఖంగుతినిపించింది. గల్ఫ్ దేశాలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.

పశ్చిమాసియాలో యుద్ధానికి రెండు వారాలు పూర్తయింది. అటు ఇజ్రాయెల్- అమెరికా, ఇటు ఇరాన్‌ వెనక్కి తగ్గడం లేదు. ఏమాత్రం తగ్గకుండా పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇక, హర్మూజ్ జల సంధిని నియంత్రిస్తూ… అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా ఆదివారం ఇరాన్ సెజ్జిల్ సహా అత్యాధునిక క్షిపణులతో దాడులు చేసింది. సెజ్జిల్ అనేది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన, ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. సెజ్జిల్-2 ఘన ఇంధనంతో పనిచేసే రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దాదాపు 700 కిలోల పేలోడ్‌ల సామర్థ్యం కలిగి ఉండే ఈ క్షిపణి 2,000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను చేరుకోగలదు. అధిక ఎత్తులో విన్యాసాలు నిర్వహించే సామర్థ్యం వల్ల దీనికి ‘ డ్యాన్సింగ్ మిసైల్‌ ’ అనే పేరొచ్చింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉంది. దాదాపు 18 మీటర్ల పొడవు, దాదాపు 1.25 మీటర్ల వ్యాసం ఉండే సెజ్జిల్-2 బరువు దాదాపు 23,600 కిలోలు. ఇందులోని ఘన ఇంధనం ఒక వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. సెజ్జిల్ క్షిపణి రూపకల్పన పనులు 1990 దశకంలో మొదలయ్యాయి. తొలిసారి దీనిని 2008లో పరీక్షించగా.. 800 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. తర్వాత అధునాతన నావిగేషన్ వ్యవస్థలను జోడించి 2009లో రెండోసారి పరీక్షించారు. అప్పటి నుంచి మరో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించగా.. ఆరోసారి ఈ క్షిపణి హిందూ మహాసముద్రంలోకి సుమారు 1,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు సమాచారం. యుద్దం 16వ రోజున ఇరాన్ ఈ క్షిపణిని బయటకు తీసింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త దాడులతో యుద్ధం ప్రారంభమైంది.తొలి రోజే సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఇరాన్ కీలక నాయకులు, ఉన్నతాధికారులు మరణించడంతో అమెరికా-ఇజ్రాయెల్ సంబరాలు చేసుకున్నాయి. ఇక, ఇరాన్ తమకు తలవంచినట్టే అని భావించాయి. కానీ, అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. ఇరాన్ నుంచి ఊహించని ప్రతిఘటనతో ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఖంగుతిన్నారు. ఈ విషయంలో వారి అంచనాలు తప్పని ఇరాన్ ప్రతికార చర్యలు నిరూపించాయి. ఇరాన్‌ పూర్తిగా దెబ్బతిందని, లొంగిపోవడానికి సిద్ధమైందని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..

నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా

టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్‌ వన్‌ చైర్‌.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా

టాలీవుడ్‌లో నెంబర్‌ గేమ్‌.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??

Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే

Follow Us