AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం!

చైనాలో డాల్ఫిన్‌ టైపూన్‌ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం!

Phani CH
|

Updated on: Aug 10, 2026 | 9:29 PM

Share

పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన డాల్ఫిన్ టైఫూన్ చైనా తూర్పు తీరాన్ని వణికిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుపాను ప్రభావంతో షాంఘై సహా పలు నగరాల్లో జనజీవనం స్తంభించింది. ముందుజాగ్రత్తగా 1,300కుపైగా విమాన సర్వీసులు రద్దు చేశారు. జెజియాంగ్, షాంఘై ఓడరేవులను మూసివేసి, సుమారు 3.90 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదలపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన ‘డాల్ఫిన్’ టైఫూన్ చైనా తూర్పు తీరప్రాంతాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల ప్రచండ వేగంతో విరుచుకుపడుతున్న ఈ రాకాసి తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ జారీ చేసి, అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ టైఫూన్ ప్రభావం ముఖ్యంగా షాంఘై, జెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సులపై తీవ్రంగా పడింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా షాంఘైలోని హాంకియావో, పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆదివారం ఒక్కరోజే 1,300కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇది మొత్తం విమాన రాకపోకల్లో దాదాపు 60 శాతానికి సమానం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జెజియాంగ్, షాంఘై ఓడరేవులను అధికారులు ఖాళీ చేయించగా.. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో రైళ్లు, పడవల రవాణాను నిలిపివేశారు. తీవ్రమైన వర్షాలు, హఠాత్ వరదల ముప్పు పొంచి ఉండటంతో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని తైజౌ నగరం, షాంఘై పరిసర లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 3.90 లక్షల మంది ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తీర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, పర్యాటక ప్రాంతాలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. ఈ డాల్ఫిన్ తుపాను చైనా తీరాన్ని తాకడానికంటే ముందే జపాన్‌లోని ఒకినావా దీవులు, తైవాన్ ఉత్తర భాగాల్లో కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టించింది. రాబోయే రోజుల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన తుపానుల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉందని చైనా వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రాఫిక్‌లో పైలట్‌.. విమానంలో 175 మంది ప్రయాణికులు

భారతీయ టెక్కీలకు బిగ్‌ షాక్‌.. గ్రేస్ పిరియడ్ రద్దు!

రెంట్ బాయ్‌ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల.. డిస్కౌంట్‌ ఆఫర్లతో నిండా ముంచేస్తున్నారు

Gold Prices: పసిడి ప్రియులకు షాక్‌.. బంగారం కొనాలా? వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..

Follow Us