AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

Phani CH
|

Updated on: Aug 08, 2026 | 5:51 PM

Share

డెన్మార్క్ రాజకుటుంబంలో ప్రిన్సెస్ ఇసాబెల్లా అరుదైన ఘనత సాధించారు. 19 ఏళ్ల ఆమె 11 నెలల పూర్తిస్థాయి సైనిక శిక్షణలో చేరిన తొలి మహిళా డానిష్ రాజవంశీకురాలిగా చరిత్ర సృష్టించారు. స్లాగెల్సేలోని గార్డ్ హుస్సార్ రెజిమెంట్‌లో సాధారణ సైనికురాలిగానే విధుల్లో చేరిన ఆమె ప్రత్యేక రాజభోగాలు తీసుకోనని తెలిపారు. సైనిక శిక్షణ సమయంలో ప్రభుత్వ వేతనం కూడా స్వీకరించబోనని ప్రకటించారు. డెన్మార్క్ కొత్త తప్పనిసరి సైనిక సేవా విధానంలో ఆమె తొలి బ్యాచ్‌లో చేరారు.

డెన్మార్క్ రాజవంశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. ఆ దేశ రాజు ఫ్రెడెరిక్ X, రాణి మేరీల కుమార్తె, 19 ఏళ్ల ప్రిన్సెస్ ఇసాబెల్లా పూర్తిస్థాయి సైనిక సేవల్లోకి అడుగుపెట్టారు. డెన్మార్క్ రాజకుటుంబం నుంచి పూర్తిస్థాయి సైనిక శిక్షణలో చేరిన తొలి మహిళా రాజవంశీకురాలిగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారు. డెన్మార్క్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11 నెలల తప్పనిసరి సైనిక శిక్షణ నిబంధనలకు అనుగుణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. హైస్కూల్ విద్య పూర్తయిన వెంటనే, స్లాగెల్సేలోని ఆంట్‌వోర్స్కోవ్ బ్యారెక్స్‌కు చెందిన ‘గార్డ్ హుస్సార్ రెజిమెంట్’లో ఆమె రిపోర్ట్ చేశారు. ఎలాంటి రాజభోగాలు, ప్రత్యేక హోదాలు ఆశించకుండా ఒక సాధారణ సైనికురాలిగానే ఆమె విధుల్లో చేరడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ 11 నెలల శిక్షణ కాలంలో సాధారణ సైనికులకు ఇచ్చే ప్రభుత్వ వేతనాన్ని లేదా జీతభత్యాలను తాను తీసుకోనని ప్రిన్సెస్ ఇసాబెల్లా స్పష్టం చేశారు. తన ఖర్చుల కోసం తల్లిదండ్రుల ఆర్థిక అండపైనే ఆధారపడతానని వెల్లడించినట్లు రాజభవనం ప్రకటించింది. గతంలో ఆమె సోదరుడు, యువరాజు క్రిస్టియన్ కూడా ఇదే రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. యూరప్, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మారుతున్న భద్రతా సమీకరణాల నేపథ్యంలో డెన్మార్క్ ప్రభుత్వం తమ సైనిక వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఇందులో భాగంగానే సైనిక సేవా కాలాన్ని 4 నెలల నుంచి 11 నెలలకు పెంచడమే కాకుండా, దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళలకు కూడా తప్పనిసరి సైనిక సేవను వర్తింపజేసింది. ఈ నూతన సంస్కరణల కింద శిక్షణ పొందుతున్న తొలి బ్యాచ్‌లోనే రాజకుమారి చేరడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ!

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

Follow Us