నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా
సోషల్ మీడియాలో కిడ్నీ వ్యాధులను నీటితో నయం చేయవచ్చనే అపోహ ఉంది. అయితే, నిపుణుల ప్రకారం, కిడ్నీ రోగులు అతిగా నీరు తాగడం ప్రమాదకరం, వాపులు, బీపీ పెరగడానికి దారితీస్తుంది. ఆరోగ్యవంతులకు 2-3 లీటర్లు సరిపోతుంది, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే నీరు తాగాలి. షుగర్, బీపీ అదుపులో ఉంచుకోవడం కిడ్నీ ఆరోగ్యానికి కీలకం.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవల ఈ విషయం సామాజిక మాధ్యమాల్లోనూ తరచుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ నీరు తాగితే కిడ్నీ వ్యాధులు నయమవుతాయని, పాడైన కిడ్నీలు మళ్ళీ పని చేస్తాయన్న ప్రచారంపై వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని, అతిగా నీరు తాగడం కిడ్నీ రోగులకు మంచిదికాదని వారు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోయడానికి నీరు అవసరమే. డీహైడ్రేషన్ వల్ల వచ్చే కిడ్నీ రాళ్ల వంటి సమస్యలను నీటితో నివారించవచ్చు. అయితే, మధుమేహం లేదా రక్తపోటు వల్ల ఇప్పటికే దెబ్బతిన్న కిడ్నీ ఫిల్టర్లను నీరు పునరుద్ధరించలేదు. నిపుణులు వివరాల ప్రకారం.. కిడ్నీ పనితీరు క్షీణించిన వారు అతిగా నీరు తాగితే అది శరీరంలో వాపులకు, రక్తపోటు పెరగడానికి దారి తీస్తుంది. అడ్వాన్స్‌డ్ కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో అదనపు ద్రవాలను బయటకు పంపే శక్తి తగ్గిపోతుంది. అటువంటి వారు ఎక్కువ నీరు తాగితే ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు 2 నుండి 3 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవడం సరైనదే అయినా, కిడ్నీ బాధితులు మాత్రం తమ డాక్టర్ సూచించిన పరిమాణంలోనే నీరు తాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం నీటిపైనే ఆధారపడకుండా షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవాలని, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని అనుసరించేముందు మీ వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్‌లో ఖాళీగా ఉన్న నెంబర్ వన్ చైర్.. ఈ సింహాసనం ఆ హీరో కోసమేనా
టాలీవుడ్‌లో నెంబర్ గేమ్.. రేసులో ఉన్న స్టార్స్ ఎవరు ??
Prabhas: ప్రభాస్ 2.0.. నయా స్టైల్ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే
వెండితెరకు కూడా తప్పని గ్యాస్ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత
సిలిండర్ కోసం 'చెప్పుల' క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా
దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువకుడి ఘాతుకం!
తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు
కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి
తండ్రి డ్రైవర్.. కొడుకు కండక్టర్.. ఒకే బస్సులో విధులు
నగల షాపు యజమాని కళ్లలో కారం కొట్టి దోపిడీ !!

