AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం

Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం

Phani CH
|

Updated on: Mar 17, 2026 | 6:47 PM

Share

ఇరాన్ క్షిపణి దాడుల కారణంగా దుబాయ్ కళతప్పి, 'ఘోస్ట్ టౌన్'గా మారింది. బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా, విమానయానం స్తంభించి, హోటళ్లు బోసిపోయాయి. బిలియనీర్ల స్వర్గధామం యుద్ధ వాతావరణంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులకు యోగేశ్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తలు ఉచిత వసతి, భోజనం అందించి ఆదుకుంటున్నారు. దుబాయ్ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇరాన్ దుబాయ్‌ని టార్గెట్‌గా చేసుకుని క్షిపణులతో దాడులు చేయడంతో దుబాయ్‌లోని బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. హై-ఎండ్ దుకాణాలు , దుబాయ్ గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్ ఇతర ప్రముఖ పర్యాటక ఆకర్షణలను తాత్కాలికంగా మూసివేశారు. దుబాయ్ అంటే బిలియనీర్ల స్వర్గధామం. లగ్జరీ విల్లాలు రియల్‌ ఎస్టేట్‌కు మారుపేరు. విలాసవంత రిసార్ట్‌లు, స్టార్ హోటళ్లు ఆకర్షణీయ పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం యుద్ధవాతావరణంతో దుబాయ్‌ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసాయి. ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించిన తర్వాత దుబాయ్ క్రమంగా కళతప్పి ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారింది. వీకెండ్‌లో ట్రాఫిక్‌తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారింది. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపేశారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరకే గదులు ఇస్తున్నాయి. యుద్ధం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు కొంతకాలం నిలిచిపోయాయి. ప్రస్తుతం కొద్దిగా విమానాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి కానీ పూర్తిస్థాయిలో సేవలు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. దుబాయ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చే బుర్జ్‌ ఖలీఫా, దుబాయ్‌ మాల్ ప్రాంతాలలో ఇప్పుడు జనమే లేరంటే నమ్మాల్సిందే. మరోవైపు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో జనం ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్నీ బోసిపోతున్నాయి. ఆపదలో ఉన్న భారతీయుల కోసం బాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అల్ మిజాన్ గ్రూప్ ఛైర్మన్ యోగేశ్‌ దోషి, తన 64 అపార్ట్‌మెంట్ల రెసిడెన్షియల్ భవనాన్ని పూర్తిగా కేటాయించారు.ఈ సాయం తమకు సరైన సమయంలో అందిందని భారతీయులు మీడియాకు తెలిపారు. ఇదే తరహాలో దుబాయ్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని అజ్మాన్‌లోనూ మరో భారత వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన పెద్ద ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక షెల్టర్‌గా మార్చారు. హోటల్‌ రూముల్లో ఉండటానికి డబ్బుల్లేక ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్న భారతీయులకి ఉచితంగా వసతి, భోజనం అందిస్తున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తన ఫామ్‌హౌస్‌కు తీసుకురావడానికి 6 రోల్స్ రాయిస్ కార్లతో పాటు మొత్తం 11 వాహనాలను ఏర్పాటు చేయడం విశేషం. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్థానికులు కొంత మంది అలాగే పర్యాటకులు దుబాయ్‌ను విడిచివెళ్లారు. దీంతో విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను దుబాయ్‌ ఆకర్షించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు నగర ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూగర్భంలో ఇరాన్‌ ‘మిస్సైల్‌ సిటీ’.. అమెరికాకు కొత్త సవాళ్లు

షిర్డీ అన్నప్రసాదాన్ని.. తాకని ‘గ్యాస్‌ సెగలు’.. ఎందుకంటే..

యుద్ధరంగంలోకి ఇరాన్‌ ‘డ్యాన్సింగ్‌ మిసైల్‌’..!

భారత్‌లో భూగర్భంలో చమురు నిల్వలు..

నీళ్లు ఎక్కువ తాగితే.. పాడైన కిడ్నీలు మళ్ళీ పనిచేస్తాయా

Follow Us