AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి

Phani CH
|

Updated on: Mar 17, 2026 | 8:18 PM

Share

రోడ్డు ప్రమాదంలో చేయి, కాలు విరిగినా రాజన్న సిరిసిల్ల విద్యార్థి అమన్ రెహమాన్ పట్టుదల వదల్లేదు. తీవ్ర గాయాలతో వీల్ చైర్‌లో పరీక్షా కేంద్రానికి చేరుకుని, స్క్రైబ్ సహాయంతో పదో తరగతి పరీక్షలు రాశాడు. నొప్పిని లెక్కచేయకుండా చూపిన అతని ఏకాగ్రత, "వైకల్యం శరీరానికే, ఆలోచనలకు కాదు" అనే సందేశం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అమన్ కథ ఓటమిని అంగీకరించని దృఢ సంకల్పానికి నిదర్శనం.

దృఢ సంకల్పం ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురుతిరిగినా లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం కాదని నిరూపించాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థి అమన్ రెహమాన్. రోడ్డు ప్రమాదంలో చేయి, కాలు విరిగి తీవ్ర గాయాల పాలైనప్పటికీ, తన భవిష్యత్తును నిర్ణయించే వార్షిక పరీక్షలను వదులుకోకూడదని పట్టుదలతో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్‌కు చెందిన అమన్ రెహమాన్ కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలు, చేయి విరగడంతో వైద్యులు సిమెంట్ కట్టు వేశారు. తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్నా, ఏడాది కాలం పాటు పడ్డ కష్టం వృథా కాకూడదని అమన్ నిర్ణయించుకున్నాడు. విరిగిన చేత్తో రాయడం సాధ్యం కాకపోవడంతో, అధికారుల అనుమతితో ‘స్క్రైబ్’సహాయాన్ని కోరాడు. పరీక్షా కేంద్రానికి వీల్ చైర్‌లో చేరుకున్న అమన్‌ను చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. స్క్రైబ్ సహాయంతో అమన్ ఒక్కో ప్రశ్నకు సమాధానం చెబుతుంటే, అది రాస్తున్న తీరు అక్కడి వారిని కదిలించింది. నొప్పిని సైతం లెక్కచేయకుండా అతను చూపిన ఏకాగ్రత అందరినీ మంత్రముగ్ధులను చేసింది. చిన్న కష్టం వస్తేనే కుంగిపోయే నేటి కాలంలో, ప్లాస్టర్ వేసిన కాలు, విరిగిన చేత్తో పరీక్ష రాసిన అమన్ పట్టుదల జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “వైకల్యం శరీరానికే కానీ ఆలోచనలకు కాదు” అని అమన్ నిరూపించాడని ఉపాధ్యాయులు అభినందించారు. ఓటమిని అంగీకరించని అమన్ రెహమాన్ కథ ఇప్పుడు ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్‌లో భారీ మార్పులు

దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..

Dubai: యుద్ధం దెబ్బకు ‘ఘోస్ట్‌ టౌన్‌’గా మారిన దుబాయ్‌.. మొత్తం గంగార్పణం

Follow Us