AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ‘ఖమేనీ’ పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.? ఆ పేరు ఎలా వచ్చిందంటే

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య వార్ కొనసాగుతోంది. అటు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఈ యుద్ధంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపధ్యంలో చాలా భయాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఓ చర్చ ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్‌లో ఖమేని పేరిట ఓ రోడ్డు ఉంది.

Hyderabad: హైదరాబాద్‌లో 'ఖమేనీ' పేరుతో రోడ్డు ఉందని మీకు తెలుసా.? ఆ పేరు ఎలా వచ్చిందంటే
Khamenei Road
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 12:14 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా యుద్ధం గురించే చర్చ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఒక పేరు మాత్రం పెను సంచలనం సృష్టిస్తోంది. అదే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ పేరు. ఇటీవలి దాడుల్లో ఖమేనీ మృతి చెందడంతో యుద్ధం మరింత తారాస్థాయికి చేరుకుంది. ఇక్కడ మరింత ఆశ్చర్యపోయే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఖమేనీ పేరు మీద హైదరాబాద్ మహా నగరంలో ఏకంగా ఓ రోడ్డే ఉందట. ఏంటి.. వినడానికి చాలా వింతగా ఉంది కదూ..!

ఇరాన్ దాడుల నేపథ్యంలో అల్లకల్లోలమైన ప్రపంచ దేశాలను ఇప్పుడీ విషయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భాగ్యనగరంలో ‘ఖమేనీ’ రోడ్డు ఉందన్న విషయం తాజా దాడుల నేపథ్యంలో కొత్తగా బయటికి వచ్చింది. అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఖమేనీ పేరుతో ఒక రోడ్డు ఉందన్న విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అది కూడా నగరంలోనే ప్రముఖంగా వినిపించే బంజారాహిల్స్‌లో ఈ పేరుతో రోడ్డు ఉండటం విశేషం. ఇక్కడే మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అయతొల్లా అలీ ఖమేనీ పేరు మీద నగరంలో రోడ్డు ఉందన్న విషయం వైరల్ అవుతున్న నేపధ్యంలో ప్రస్తుతం మరణించిన నేత పేరుతో కాకుండా ఇరాన్ తొలి సుప్రీం లీడర్ జ్ఞాపకార్థమే ఈ రోడ్డుకు ఈ పేరు పెట్టారని అసలు విషయం బయటపడింది. ఈ విషయం మాకు ఇప్పటివరకూ తెలియదని, ఖమేనీ మరణం తర్వాతే ఇలాంటి ఆశ్చర్యం కలిగించే కొత్త విషయాలు బయటికి వస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.

ఇంతకీ హైదరాబాద్ నగరంలో ఈ రోడ్డు ఎక్కడ ఉందనే కదా ఇప్పుడు మీ అనుమానం..! GVK One మాల్ ఎదురుగా ఉండే బంజారాహిల్స్ రోడ్డు నెం.7ని అధికారికంగా ‘ఇమామ్ ఖమేనీ రోడ్’ అని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం ఉండటంతో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ రోడ్డుకు ఈ పేరును పెట్టినట్లు సమాచారం. కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న ధృడమైన సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలకు గుర్తుగా అప్పటి అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అప్పటి ప్రభుత్వం ఈ పేరును అధికారికంగా రికార్డుల్లో కూడా చేర్చింది.

ఖమేనీ పేరుతో ఎందుకింత ధృడ సంబంధం.?

ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ రుహొల్లా ఖమేనీ పూర్వీకులకు మన దేశంతో విడదీయలేని సంబంధాలు ఉండేవి. ఖమేనీ తాతలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన కింతూరులో పుట్టారని చరిత్రకారులు చెబుతున్న మాట. 19వ శతాబ్దంలోనే ఖమేనీ పూర్వీకులు ఇరాన్‌కు వలస వెళ్లి అక్కడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో ఈ సంబంధం ఇలా కొనసాగింది. అయితే.. తాజా దాడుల ఘటనలో అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. డౌన్‌టౌన్‌లోని ఖమేనీ కాంపౌండ్‌ లక్ష్యంగా ఫిబ్రవరి 28న ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ ఇరాన్ మరింత అట్టుడికిపోయింది. తమ దేశంపై దాడి చేసిన ఇజ్రాయెల్, అమెరికాలను వదిలే ప్రసక్తే లేదని ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ క్రమంలో శత్రుదేశాల మధ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇదంతా ఇలా ఉండగా.. ఖమేనీ మరణం తర్వాత హైదరాబాద్ నగరంలో ఓ రోడ్డు ఉందనే విషయాన్ని ఓ నెటిజన్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా వెల్లడించడంతో ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: మ్యాజిక్ రైస్ బాబోయ్.! వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర