AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice: మ్యాజిక్ రైస్ బాబోయ్.! వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు

ఒక్క అరగంట ఆగురా.! వేడివేడిగా అన్నం వడ్డిస్తానంటుంది అమ్మ. కానీ.. అస్సలు బియ్యాన్ని పొయ్యి మీద ఉడికించకుండానే అన్నం రెడీ అయిపోతే.. ఈ ఊహ ఎంత బాగుందో కదా.! అవునండీ.! ఇది మన తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన రైతు ఈ ధ్యాన్యాన్ని పండిచాడు.

Rice: మ్యాజిక్ రైస్ బాబోయ్.! వండకుండానే క్షణాల్లో అన్నం రెడీ.. నీళ్లు పోస్తే చాలు
Magic Rice
Ravi Kiran
|

Updated on: Mar 03, 2026 | 11:45 AM

Share

‘మ్యాజిక్ రైస్’.. ఈ పేరుకు తగ్గట్టుగానే అద్భుతమైన బియ్యం ఇది. వంట చేయాల్సిన అవసరం లేకుండా, కేవలం నీళ్లలో నానబెడితే చాలు, అరగంటలో అన్నం తయారవుతుంది. కరీంనగర్ జిల్లా, శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ మ్యాజిక్ రైస్‌ను సాగు చేస్తున్నాడు. దీనికి స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, వండాల్సిన పని లేదు. కేవలం నీళ్లలో అరగంట నానబెడితే చాలు, అన్నం సిద్ధమైపోతుంది. శ్రీకాంత్ మొదటి నుంచీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తొలుత రసాయన ఎరువులతో వ్యవసాయం చేసినా, తర్వాత ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. సుభాష్ పాలేకర్ ప్రసంగాల ద్వారా ప్రేరణ పొంది, తొమ్మిది రాష్ట్రాలు పర్యటించి దాదాపు 120 రకాల దేశీయ వరి వంగడాలను సేకరించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేంద్రీయ విధానంలోనే వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడి సమస్యలు, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

శ్రీకాంత్ గతంలో అస్సాం నుంచి తీసుకొచ్చిన బోకాసాల్ అనే వరి రకం బియ్యం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేసే ఈ పంట 145 రోజుల్లో చేతికి వస్తుంది. బోకాసాల్ బియ్యాన్ని చల్లటి నీళ్లలో నానబెడితే చల్లటి అన్నం, వేడి నీళ్లలో నానబెడితే వేడి అన్నం తయారవుతుంది. సరిపడా నీళ్లు పోసి సుమారు అరగంట నుంచి నలభై నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఈ బియ్యం పోషక విలువలను గౌహతి యూనివర్సిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. దీనిలో 10.73 శాతం పీచు(ఫైబర్), 6.8 శాతం ప్రొటీన్లు ఉంటాయని గుర్తించారు. అధిక పీచు శాతం కారణంగా, ఇది నెమ్మదిగా జీర్ణమై ఎక్కువ కాలం శక్తిని అందిస్తుందని శ్రీకాంత్ చెబుతున్నాడు. అంతరించిపోతున్న దేశీ వంగడాలలో ఇదొకటి. అస్సాంలోని గిరిజనులు, సైన్యం ఈ బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కూరలు లేకుండా కూడా తినగలిగే వరి ధాన్యం ఇది.

ఇది చదవండి: చనిపోయే 30 సెకన్ల ముందు మెదడులో ఏం జరుగుతుందంటే.? షాకింగ్ నిజం

Follow Us
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
బాల్యానికి పుస్తెల బంధం.. పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి..
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్
NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్