AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?

Vande Bharat Sleeper: ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్‌ లగ్జరీ మేకోవర్‌తో అద్దిరిపోతోంది. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే ఇంటీరియర్స్, విశాలమైన కేబిన్లు, ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ కోచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి ప్రయాణాలకు సరికొత్త అనుభూతిని అందించనున్న ఈ వందే భారత్ స్లీపర్‌పై ప్రయాణికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు సేవలు త్వరలోన ప్రారంభంకానున్నాయి.

Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?
Vande Bharat Sleeper
Janardhan Veluru
|

Updated on: Jul 28, 2026 | 3:45 PM

Share

భారతీయ రైల్వే ప్రయాణ అనుభూతిని మరింత విలాసవంతంగా మార్చే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లను పనిచేస్తున్నారు. త్వరలో ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ కోచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కోచ్‌ను చూసిన నెటిజన్లు దీనిని పట్టాలపై నడిచే ఫైవ్ స్టార్ హోటల్ అంటూ ప్రశంసిస్తున్నారు.

వందే భారత్ స్లీపర్‌లోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేశారు. ఆధునిక ఇంటీరియర్స్, ప్రీమియం ఫినిషింగ్, మెరుగైన లైటింగ్, మరింత వ్యక్తిగత గోప్యత కలిగిన కేబిన్లు, విశాలమైన బెర్త్‌లు ఈ కోచ్ ప్రత్యేకతలు. సంప్రదాయ స్లీపర్ రైళ్లలో కనిపించే సాధారణ వాతావరణానికి భిన్నంగా, ఈ కోచ్‌లో హోటల్ గదిని తలపించేలా డిజైన్ రూపొందించారు.

వందే భారత్ స్లీపర్ రైళ్లు ముఖ్యంగా సుదూర రాత్రి ప్రయాణాలను మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించబడ్డాయి. ఫస్ట్ ఏసీతో పాటు సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు కూడా ఆధునిక సదుపాయాలతో అందుబాటులో ఉండనున్నాయి. ఆటోమేటిక్ డోర్లు, బయో-వాక్యూం టాయిలెట్లు, మెరుగైన లైటింగ్, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు, సీసీటీవీ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి.

ముంబై – బెంగళూరు వందే భారత్ స్పీపర్ ఫస్ట్ ఏసీ వీడియో

ముంబై–బెంగళూరు మార్గంలో ఈ వందే భారత్ స్లీపర్ ప్రారంభమైతే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ప్రయాణ అనుభవం కూడా కొత్త రేంజ్‌కి చేరుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?