AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth : శ్రీకాంత్ చెల్లెలు తెలుగులో తోపు నటి.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఒక్క డైలాగ్‏తో ఫేమస్..

‏ఒకప్పుడు హీరోగా.. ప్రస్తుతం సహయ నటుడిగా, విలన్ పాత్రలతో రాణిస్తున్నాడు శ్రీకాంత్. అప్పట్లో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఆయన.. ఇప్పటికీ వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే ఈ హీరో చెల్లెలు సైతం తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది.

Srikanth : శ్రీకాంత్ చెల్లెలు తెలుగులో తోపు నటి.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఒక్క డైలాగ్‏తో ఫేమస్..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2026 | 1:12 PM

Share

టాలీవుడ్‌లో తనదైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఒకప్పుడు హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఆయన.. ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. అంతేకాదు అటు అమ్మాయిలు, ఇటు ఫ్యామిలీ అడియన్స్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే శ్రీకాంత్ చెల్లెలు కూడా తెలుగులో సుపరిచితమైన నటి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ నటి మరెవరో కాదు.. అనితా చౌదరి. ప్రభాస్ నటించిన ఛత్రపతిలో అంధురాలి పాత్రలో నటించింది. ఇందులో వచ్చే సూరీడు అన్న ఒక్క డైలాగ్ తో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల్లో కనిపించిన అనిత నేపథ్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన అనితా చౌదరి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. రాజా, మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబి రెడ్డి వంటి పలు చిత్రాల్లో ఆమె సందడి చేశారు. ముఖ్యంగా ఛత్రపతిలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

శ్రీకాంత్‌తో బంధుత్వం..

సినిమాల సంగతి పక్కన పెడితే, అనితా చౌదరి హీరో శ్రీకాంత్‌కు చెల్లెలు వరుస అవుతారు. ఆమె కృష్ణ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కృష్ణ చైతన్య శ్రీకాంత్‌కు దగ్గరి బంధువు కాగా, వీరి వివాహాన్ని శ్రీకాంతే దగ్గరుండి జరిపించారట. ఈ విషయాన్ని అనితా చౌదరి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. శ్రీకాంత్ కుటుంబానికి తెలుగు సినిమాతో గాఢమైన అనుబంధం ఉంది. శ్రీకాంత్ సతీమణి ఊహ ఒకప్పుడు కథానాయికగా గుర్తింపు తెచ్చుకోగా, కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్ వంటి చిత్రాలతో హీరోగా ముందుకు సాగుతున్నారు. శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ కూడా ప్రేమించేయి ఎందుకమ్మా చిత్రంతో హీరోగా కనిపించడంతో పాటు కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు కూతురు సైతం కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

అనిత చౌదరి పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే