సినిమాల్లో ఉండాలని లేదు, తిరిగి వెళ్లిపోవాలనుకున్నా.. సంయుక్త
Rajitha Chanti
Pic credit - Instagram
26 November 2026
తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక సంయుక్త తన సినీ ప్రయాణంలోని విషయాలను పంచుకున్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తాను అనుకోకుండా నటిగా మారానని, తొలినాళ్లలో సినిమా రంగం తనకు అంతగా నచ్చలేదని స్పష్టం చేశారు.
పాలక్కాడ్లోని ఒక గ్రామం నుంచి అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి వచ్చినట్లు సంయుక్త తెలిపారు. ఆరంభంలో ఆ జీవితాన్ని తాను పెద్దగా ఆస్వాదించలేదని,
తిరిగి సొంతూరు వెళ్లిపోవాలని బలంగా కోరుకున్నానని చెప్పారు. సినిమాల్లో కొనసాగాలనే ఆసక్తి అప్పుడు తనకు లేకపోయినా, పరిస్థితుల ప్రభావంతో మళ్లీ ఇదే రంగంలోకి వచ్చానని అన్నారు.
విధి తనను సినిమాల్లోకి తీసుకొచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. మొదట్లో చేసిన సినిమాలు తనకు ఆశించినంత సంతృప్తిని ఇవ్వలేదని, కెరీర్లో ఒడుదొడుకులు,
నిరాశలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సంయుక్త పేర్కొన్నారు. అయితే లిల్లీ సినిమాలో నటించినప్పుడే ఒక నటిగా తనకు సరైన స్పేస్ దొరికిందని భావించానని అన్నారు.
ఏ పాత్రకైనా దానికి తగిన స్వేచ్ఛ, అవకాశం ఉండాలని చెప్పారు. నేను నటిని అని చెప్పుకోవడం వల్ల మాత్రమే సరిపోదని, ఆ ప్రతిభను నిరూపించుకోవడానికి
తగిన కాన్వాస్ కూడా లభించాలని సంయుక్త అన్నారు. మంచి పాత్ర, బలమైన కథ వచ్చినప్పుడే ఒక నటుడు లేదా నటి తమ సత్తా చాటగలరని అన్నారు.