AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

తెలుగులో సూపర్ హిట్ సినిమా... ఆ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ మాత్రం సంగీత ప్రియుల మనసులను హత్తుకుంటుంది. ఇప్పటికీ ఆ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్ విడుదలై 26 ఏళ్లు దాటినా ఇప్పటికీ కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆహ్లాదకరమైన ట్యూన్, ఆకట్టుకునే విజువల్స్‌తో నేటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఆ సూపర్ హిట్ పాట విశేషాలివే.

Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
Lahiri Lahiri Song From Postman
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2026 | 6:37 PM

Share

తెలుగు సినీ చరిత్రలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా శ్రోతలను, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 90వ దశకం చివరలో, 2000ల ఆరంభంలో వచ్చిన అనేక మెలోడీలు, మాస్ బీట్ పాటలు నేటికీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతూ ఉంటాయి. మ్యూజిక్, లిరిక్స్ వింటూ ఉంటే మనసు ఎంతో ప్రశాంతంగా.. మరికొన్ని సందర్భాల్లో మనసు ఎనర్జిటిక్ గా మారిపోతుంది. అలాంటి అపురూపమైన పాటలలో ‘పోస్ట్‌మ్యాన్’ చిత్రంలోని ‘లాహిరి లాహిరి’ పాట ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దివంగత కథానాయిక సౌందర్య, నటి రాశి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ పాట ఇప్పటికీ సినీ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

డుదలై సుదీర్ఘ కాలం గడిచినప్పటికీ ‘లాహిరి లాహిరి’ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ ఈ పాటకు కోట్ల సంఖ్యలో వ్యూస్ లభించడమే దీనికున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది. పాటలోని ట్యూన్, సాహిత్యం, విజువల్స్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. ఈ తరహా పాటల మాధుర్యం, ఆహ్లాదకరమైన ఫీల్ ఇప్పటి తరం పాటల్లో అరుదుగా కనిపిస్తాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈ పాటలో మోహన్ బాబు ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, సౌందర్య సహజమైన అందం, రాశి గ్లామర్ కలిసి పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. ఒకే పాటలో సౌందర్య, రాశి వంటి ఇద్దరు ఆకట్టుకునే నటీమణి కనిపించడం, మోహన్ బాబు స్టైల్ తోడవడంతో ఇది ప్రేక్షకులకు కనువిందు చేసే గీతంగా నిలిచింది. ఆ కాలం నాటి చిత్రాల సంగీత శైలి, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలోని పాటల వైభవం ఈ పాట ద్వారా మరోసారి గుర్తుకు వస్తుంది. కాలం మారినా మంచి బాణీలకు, హుషారుగా సాగే పాటలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ‘లాహిరి లాహిరి’ పాట విన్నప్పుడల్లా ఒక పాత మధురమైన జ్ఞాపకం కళ్ల ముందు కదులుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. 26 ఏళ్లకు పైగా గడిచినా ఈ పాటపై ఉన్న అభిమానం, యూట్యూబ్ వ్యూస్ చూస్తుంటే.. నిజంగానే ఇప్పట్లో ఇలాంటి పాటలు రావడం కష్టమేననే అంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

లాహిరి లాహిరిలో సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Follow Us