AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం ధరలు తగ్గుతాయా..! రంగంలోకి దిగిన కేంద్రం.. కీలక చర్యలకు సిద్ధం..

దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో సోనా మసూరి, సాంబా మసూరి, ఆర్‌ఎన్‌ఆర్ వంటి రకాల ధరలు 25 శాతం వరకు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ధరలకు కళ్లెం వేసేందుకు నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై చర్యలు తీసుకునే అంశాలపై గట్టి ఫోకస్ పెట్టింది.

బియ్యం ధరలు తగ్గుతాయా..! రంగంలోకి దిగిన కేంద్రం.. కీలక చర్యలకు సిద్ధం..
Centre Plans 30 Percent Export Duty On Rice
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 23, 2026 | 6:24 PM

Share

దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నాన్-బాస్మతి బియ్యం ఎగుమతులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సీరియస్‌గా ఆలోచిస్తోంది. బియ్యం ఎగుమతులపై 30 శాతం ఎగుమతి సుంకం విధించడం, కనీస ఎగుమతి ధర నిర్ణయించడం వంటి ప్రతిపాదనలపై అంతర్-మంత్రిత్వ స్థాయిలో చర్చిస్తున్నారు. ధరలు అదుపు తప్పితే బియ్యం ఎగుమతులపై తాత్కాలిక ఎగుమతి నిషేధం కూడా చివరి ఆప్షన్‌గా ఉంచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో బియ్యం సగటు రిటైల్ ధర రూ.48.10కి చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది సుమారు 11 శాతం పెరిగింది. ఇక బ్రాండెడ్ రైస్ ధరలు కిలో 100 వరకు ఉన్నాయి. సగటు రీటైల్ ధర పరిగణలోకి తీసుకుంటే అక్టోబర్‌లో బియ్యం ద్రవ్యోల్బణం 12.51 శాతానికి చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సోనా మసూరి, పొన్ని, సాంబా మసూరి, ఆర్‌ఎన్‌ఆర్ వంటి ప్రీమియం రకాల ధరలు 10 నుంచి 25 శాతం వరకు పెరిగి సామాన్యులపై భారం పెంచాయి.

ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన ఉత్పత్తి

2026-27 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో వరి సాగు విస్తీర్ణం గతేడాది కంటే 4 శాతం తగ్గి 42.68 మిలియన్ హెక్టార్లకు పరిమితమైంది. కర్ణాటక (0.46 మిలియన్ హెక్టార్లు), తెలంగాణ (0.43), ఆంధ్రప్రదేశ్ (0.18), తమిళనాడు (0.15) వంటి రాష్ట్రాల్లో సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం 2026-27లో దేశంలో బియ్యం ఉత్పత్తి 154 మిలియన్ టన్నుల నుంచి 147 మిలియన్ టన్నులకు తగ్గే అవకాశం ఉంది.

బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం పరిశీలిస్తున్న చర్యలు

దేశంలో బియ్యం ధరల పెరుగుదల అంశం నవంబర్ మొదటి వారంలోనే అంతర్-మంత్రిత్వ కమిటీ ముందు చర్చకు వచ్చింది. భారతీయ వైట్ రైస్ ఎఫ్‌ఓబీ ధర టన్నుకు 384-389 డాలర్లు ఉండగా, పాకిస్తాన్ 415 డాలర్లు, థాయ్‌లాండ్ 495 డాలర్లు, వియత్నాం 480 డాలర్లు కోట్ చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 30 శాతం ఎగుమతి సుంకం విధిస్తే భారత్ అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వం తగ్గి దేశీయ సరఫరా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. 20 శాతం సుంకం విధించినా థాయ్‌లాండ్, వియత్నాం కంటే భారత్ పోటీగా ఉండగలదని, కేవలం పాకిస్తాన్ మాత్రమే తక్కువ ధరకు అందించగలదని సమాచారం. అదనంగా కనీస ఎగుమతి ధర నిర్ణయించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

ధరలు మరింత పెరిగితే తాత్కాలిక ఎగుమతి నిషేధం చివరి ఆప్షన్‌గా ఉంచారు. గత 2023లో విధించిన నిషేధం 14 నెలలపాటు కొనసాగినట్లు కాకుండా ఇప్పుడు తాత్కాలికంగా, క్యాలిబ్రేటెడ్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ట్రేడర్లు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, మిల్లర్లు తమ బియ్యం, ధాన్యం నిల్వలను ప్రతి వారం డిక్లేర్ చేయాలని ఆహార శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో స్టాక్ లిమిట్లు విధించేందుకు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద బియ్యం విక్రయాల లక్ష్యాన్ని 25 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నులకు పెంచి ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది.

ఎగుమతిదారుల ఆందోళన

ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రణ్‌జీత్ సింగ్ జోసన్ ఎగుమతులపై ఏవైనా ఆంక్షలు లేదా అదనపు సుంకాలు విధించే ముందు ఎగుమతిదారుల ప్రయోజనాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, విదేశీ కొనుగోలుదారుల విశ్వాసం వంటి అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2025-26లో భారత్ 15.04 మిలియన్ టన్నుల నాన్-బాస్మతి బియ్యం ఎగుమతి చేసి 5.87 బిలియన్ డాలర్లు సంపాదించింది. ప్రస్తుతం ప్రభుత్వం దేశీయ ధరల నియంత్రణ, రైతుల ప్రయోజనాలు, ఎగుమతి రంగం మధ్య సమతుల్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై తుది నిర్ణయం రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Follow Us
బియ్యం ధరలు తగ్గుతాయా..! రంగంలోకి దిగిన కేంద్రం..
బియ్యం ధరలు తగ్గుతాయా..! రంగంలోకి దిగిన కేంద్రం..
కరోనా పోయింది.. ఇంకా ఆ రూల్ ఎందుకు? ఐసీసీకి గిల్ సూటి ప్రశ్న
కరోనా పోయింది.. ఇంకా ఆ రూల్ ఎందుకు? ఐసీసీకి గిల్ సూటి ప్రశ్న
SBI నుండి రూ.1 లక్ష వ్యక్తిగత రుణం తీసుకుంటే ఎంత వడ్డీ?
SBI నుండి రూ.1 లక్ష వ్యక్తిగత రుణం తీసుకుంటే ఎంత వడ్డీ?
అతన్ని పిచ్చిగా ప్రేమించా.. కానీ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య
అతన్ని పిచ్చిగా ప్రేమించా.. కానీ.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య
నీలి సముద్రంలో ఎరుపు రాయి వేస్తే ఏమవుతుంది? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
నీలి సముద్రంలో ఎరుపు రాయి వేస్తే ఏమవుతుంది? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
Video: సిగ్గుచేటు! చెత్తను శుభ్రం చేసిన విదేశీ మహిళలు!
Video: సిగ్గుచేటు! చెత్తను శుభ్రం చేసిన విదేశీ మహిళలు!
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
నాతో కలిసి నటించిన హీరోయిన్.. ఇప్పుడు ఎంపీ అయ్యింది..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయని క్లిక్ చేస్తే కొంపకొల్లేరే..
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
అమెరికా తొలి అధ్యక్షుడి వెంట్రుకలకు లక్షల్లో ధర.. వేలంలో రికార్డ్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్
రైలులో బాలికల అక్రమ రవాణా యత్నం.. నిందితుడి అరెస్ట్