బిజినెస్ మేనేజ్మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA)పూర్తి చేసి.. 2012లో 10టీవీ ప్రారంభంతో తెలుగు మీడియా రంగంలోకి అడుగు పెట్టాను. మొదట్లో హైదరాబాద్‌లో క్రైమ్ రిపోర్టింగ్‌లో ఉన్న నేను 2013 చివర్లో ఢిల్లీ బ్యూరోకు బదిలీపై వచ్చాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భారతదేశం వేదికగా జరిగిన G-20 శిఖరాగ్ర సదస్సు సహా జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఢిల్లీ నుంచి కవర్ చేశాను.
సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సహా లీగల్ అంశాలు, పార్లమెంట్ వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. PIB అక్రెడిటెడ్ జర్నలిస్ట్‌గా కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల వార్తలతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సహా రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం, భూకంపాలు, వరదలు, వడగాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వార్తలు సహా అనేకాంశాలపై వార్తలు అందిస్తూ వస్తున్నాను. 2025లో TV9లో ‘బ్యూరో చీఫ్’గా బాధ్యతలు చేపట్టి, ఢిల్లీ బ్యూరో బాధ్యతల్లో కొనసాగుతున్నాను.
Andhra News: మొంథా తుఫాన్ డ్యామేజ్.. కేంద్రానికి నివేదిక సమర్పించిన మంత్రి లోకేష్, అనిత!
ఏపీలో 'మోంథా' తుపాను సృష్టించిన బీభత్సానికి వాటిళ్లిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించారు మంత్రులు లోకేష్, వంగలపూడి అనిత. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఇద్దరు మంత్రులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో సమావేశం అయి ఈ నివేదికలను అందజేశారు.
- Gopikrishna Meka
- Updated on: Dec 2, 2025
- 2:06 pm
పార్లమెంట్‌కు పెంపుడు కుక్కతో వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?..
ఆమె రాజ్యసభ సభ్యురాలు. శీతాకాల సమావేశాలు ప్రారంభంకావడంతో పాల్గొనేందుకు పార్లమెంట్‌కు వచ్చారు. అయితే ఆమె ఒంటరిగా రాలేదు. తనతోపాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకొచ్చింది. ఆమె చేసిన పని ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. కుక్కను పార్లమెంట్‌కు తీసుకరావడంపై బీజేపీ నేతలు ఫైర్ అవ్వగా.. రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.
- Gopikrishna Meka
- Updated on: Dec 2, 2025
- 6:38 am
Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్‌ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 12:59 pm
అలా చేస్తే స్లీపర్ కోచ్ బస్సులన్నీ క్యాన్సిల్.. NHRC స్ట్రాంగ్ వార్నింగ్.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు..
దేశవ్యాప్తంగా ఇటీవల బస్సు ప్రమాదాలు చోటు చేసుకుని.. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే.. ప్రైవేట్ ట్రావెల్స్.. స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలను నిలువరించేందుకు NHRC రంగంలోకి దిగింది. మానవ హక్కుల రక్షణ చట్టం కింద భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 10:47 am
Telangana: ఆర్డర్ చేయకుండా పార్శిల్ వచ్చిందా.? ఇది తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే
ఈరోజుల్లో మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడం కంటే చెడు కోసం దానిని దుర్వినియోగం చేయడం అధికమైపోయింది...ఇప్పటి వరకు ఈ కామర్స్ పోర్టల్స్‌లో గ్రాసరీలు, బట్టలు, చెప్పులు, షూస్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కునేవాళ్ళం.. కాని వాటి ముసుగులో కొరియర్స్ ద్వారా డ్రగ్స్ కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 29, 2025
- 2:13 pm
ఢిల్లీ ప్రజలకు స్వీట్ న్యూస్.. ఈ వార్త చూశారంటే.. పూర్తి వివరాలు ఇవిగో
దేశ రాజధాని ఢిల్లీలో మోస్ట్ అడ్వెంచర్ అండ్ థ్రిల్లింగ్ స్పోర్ట్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అందుబాటులోకి వచ్చింది.. యమునా తీరంలో హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీ అభివృద్ధి ప్రాధికారం (DDA) ఎయిర్ సఫారీ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యమునా రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదలవుతోంది.
- Gopikrishna Meka
- Updated on: Nov 29, 2025
- 2:08 pm
కేంద్రం కీలక నిర్ణయం.. వికసిత భారత్ 2047 లక్ష్యంగా అభివృద్ధికి ముందడుగు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం వికసిత భారత్..2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం..అభివృద్ధి అంటే ప్రతి రంగంలోనూ ముందండటం..అందులో కీలకమైన దేశ అంతర్గత భద్రతపై దృష్టి సారించింది కేంద్రం..ఇందుకోసం దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం పై పోలీస్ ఉన్నతాధికారుల వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేంద్రం.
- Gopikrishna Meka
- Updated on: Nov 27, 2025
- 1:56 pm
దేశ వ్యాప్తంగా పేలుళ్లకు రెండేళ్ల నుంచే సన్నాహాలు వీడియో
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగమైన డాక్టర్ షాహీన్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు సేకరించినట్లు అంగీకరించింది.
- Gopikrishna Meka
- Updated on: Nov 13, 2025
- 1:48 pm
J&K Police: జమ్మూ కాశ్మీర్ పోలీసులా మజాకా.. ఆ చిన్న క్లూతో భారీ ఉగ్ర కుట్ర ఎలా భగ్నం చేశారంటే?
దేశంలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారీ విజయం సాధించారు జమ్ముకశ్మీర్ పోలీసులు. జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం), అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఎజియుహెచ్) ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు దేశంలో జరిగే భారీ ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు.. వైట్ కాలర్ ముసుగులో దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇందోళన కలిగించే విషయం ఏంటంటే పట్టుబడిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు.
- Gopikrishna Meka
- Updated on: Nov 10, 2025
- 6:50 pm
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. 100కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం!
ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్యలతో 100 పైగా విమానాల రాకపోకలు ప్రభావితం అయ్యాయి.. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA) లో గురువారం (నవంబర్ 6) సాయంత్రం నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల ఉదయం నాటికి 100కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 7, 2025
- 10:45 am
Delhi: ‘మేమూ బాధపడ్డాం.. భారత్‌కు సాయం చేసేందుకు సిద్దం..’ చైనా కీలక ప్రకటన
భారతదేశానికి సహాయం చేయడానికి చైనా చేసిన ప్రతిపాదన ద్వారా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో బీజింగ్ అనుభవాలను భారత్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. గత దశాబ్దంలో చైనా పరిశ్రమలను మార్చడం, వాహన ఉద్గారాలను నియంత్రించడం, స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని విస్తరించడం వంటి చర్యలను వేగంగా అమలు చేసింది.
- Gopikrishna Meka
- Updated on: Nov 6, 2025
- 7:53 am
Bandi Sanjay: అతిపెద్ద మంచినీటి సరస్సును సందర్శించిన బండి సంజయ్.. అభివృద్ధిపై హామీ..
బండి సంజయ్ ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం ఉన్న లోక్ తక్ సరస్సును సందర్శించారు. దేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు అయిన లోక్ తక్ విశేషాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సరస్సు అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు పంపితే కేంద్రం సహాయం చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
- Gopikrishna Meka
- Updated on: Nov 5, 2025
- 10:53 pm