Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..
స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. గురువారం ప్రారంభంతోనే సెన్సెక్స్, నిఫ్టీ పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ ప్రభావం సూచీలపై పడిందని చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

వరుసగా మూడు రోజుల పాటు లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉగాది రోజున పతనమయ్యాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1953 పాయింట్లు, నిఫ్టీ 453 పాయింట్ల మేర పడిపోయాయి. గల్ఫ్‌లోని కీలక ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడి చేయడంతో బ్రెండ్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు పతనమయ్యాయి. ఇక యూఎస్ ఫెడ్ రిజర్వ్ తన వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. దీనివల్ల యూఎస్ బాండ్లు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు భారతీయ ఈక్విటీలలో ఎఫ్‌ఐఐల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఫెడ్ రేట్ల ప్రభావం
గురువారం గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రతికూల ప్రారంభాన్ని సూచించింది. ఫ్యూచర్స్ 453 పాయింట్లు తగ్గి 23,324 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ, ఆటో, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతానికి పైగా పడిపోయాయి అందరూ ఊహించినట్లుగానే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించి ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) బుధవారం ఫెడరల్ ఫండ్స్ రేటును 3.5 శాతం నుంచి 3.75 శాతం శ్రేణిలో యథాతథంగా ఉంచింది. భారత స్టాక్ మార్కెట్లపై ఫెడ్ నిర్ణయం ప్రభావం అరుదుగా ఉంటుంది. అయితే ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది.
నష్టాల బాటలో కంపెనీలు
పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ లాబాల్లో కొనసాగుతోండగా.. రిలయన్స్, సన్ ఫార్మా, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాన్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పాయింట్స్, ఇండిగో, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
