AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్..వేగంగా వెళ్తున్న రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్..!

రైలు ప్రయాణం అంటేనే ఎన్నో సరదాలు, మరెన్నో జ్ఞాపకాలు. కానీ, ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రయాణీకులు మాత్రం తమ ప్రయాణాన్ని ఒక హారర్ సినిమా సీన్‌లా మార్చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రైలు ప్రయాణంలో కొంతమంది ప్రయాణీకులు చేసిన ఒక సరదా విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ క్రియేటివిటీతో వారు రైలు బోగీలోనే ఒక వింతైన వాతావరణాన్ని సృష్టించారు. అసలు విషయంలోకి వెళితే..

బాబోయ్..వేగంగా వెళ్తున్న రైలు బోగీలో దెయ్యాల కలకలం.. తెల్లటి ఆకారం, నల్ల చష్మాతో హల్‌చల్..!
Ghost Costume Prank
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2026 | 9:40 AM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రయాణంలో ఉన్న ఒక రైలు బోగీలో కొంతమంది ప్రయాణీకులు తమ ఒంటిపై తెల్లటి దుప్పట్లు (White Sheets) కప్పుకుని, వాటిపై నల్లటి చష్మాలు (Sunglasses) ధరించి కనిపించారు. వారిని చూస్తుంటే అచ్చం దయ్యాల్లా (Ghosts) కనిపిస్తున్నారు. ఒక్కరు కాదు, ఆ బోగీలో ఉన్న చాలా మంది అదే విధంగా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సుమారు 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూసిన వారు, ఒకవేళ టికెట్ చెకర్ (TTE) రాత్రి పూట ఈ బోగీలోకి వస్తే పరిస్థితి ఏంటి?” అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, ఇలాంటి వేషధారణతో తోటి ప్రయాణీకులు, ముఖ్యంగా పిల్లలు భయపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ‘ఘోస్ట్ లుక్’ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో (@annu_1AD) అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి రైలు బెర్త్‌పై పడుకుని తల నుండి కాలి వరకు తెల్లటి దుప్పటి కప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా దుప్పటి పైన కళ్ళ దగ్గర నల్లటి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. కెమెరా బోగీ అంతా తిప్పగా, అక్కడ కూర్చున్న మరికొందరు ప్రయాణీకులు కూడా అదే విధంగా దెయ్యం గెటప్‌లో ఉండటం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఒకవేళ టీటీఈ వస్తే, ఆయన టికెట్లు అడుగుతారా లేక భయంతో పారిపోతారా? అని కొందరు జోకులు పేలుస్తున్నారు. బోరింగ్ జర్నీని ఇంత ఫన్నీగా మార్చుకోవచ్చని వీరు నిరూపించారు అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. రాత్రి పూట ఆకస్మాత్తుగా నిద్రలేచిన ఎవరికైనా ఇలాంటి దృశ్యం కనిపిస్తే గుండె ఆగినంత పనవుతుంది అని కొందరు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం లేదా సరదా కోసం చేసే ఇలాంటి పనులు పక్కవారికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు ఫర్వాలేదు. ఏది ఏమైనా, ఈ ప్రయాణీకుల ఘోస్ట్ గెటప్ మాత్రం ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు
శ్రావణ పుత్రద ఏకాదశి 2026: రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి..
శ్రావణ పుత్రద ఏకాదశి 2026: రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి..
రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. వాస్తవమేనా..?
రూ.3250 చెల్లిస్తే చాలు.. రూ.20 లక్షల లోన్.. వాస్తవమేనా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర