AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ప్రశ్నతో రూ.1 లక్ష నుండి రూ. 57 వేలకు తగ్గిన ఆసుపత్రి బిల్లు..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాజిక్!

మన దేశంలో వైద్య ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో చేరితే బిల్లులు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే, ఆసుపత్రి ఇచ్చే ఫైనల్ బిల్లును కళ్లు మూసుకుని కట్టేయకుండా, అందులో ఏయే ఖర్చులు ఉన్నాయో అడిగి తెలుసుకోవడం వల్ల వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చని నిరూపించింది ఈ వైరల్ ఘటన. తాజాగా ఒక వ్యక్తికి లక్ష రూపాయల బిల్లు రాగా, అతను దానిని కూలంకషంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రతి చిన్న ఖర్చును విడిగా చూపే ఐటమైజ్డ్ బిల్ అడగటంతో అసలు విషయం బయటపడింది.

ఒక్క ప్రశ్నతో రూ.1 లక్ష నుండి రూ. 57 వేలకు తగ్గిన ఆసుపత్రి బిల్లు..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాజిక్!
Hospital Bill
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2026 | 8:17 AM

Share

ఆసుపత్రి బిల్లుల విషయంలో సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఒక ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి కేవలం ఐటమైజ్డ్ బిల్ అడగడం ద్వారా తన ఆసుపత్రి ఖర్చును దాదాపు సగానికి తగ్గించుకోగలిగారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి షేర్ చేసిన పోస్ట్ ప్రకారం, తన బంధువు ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ సమయంలో రూ. 1,00,000 బిల్లు చేతిలో పెట్టారు. ఆ మొత్తాన్ని చూసి ఆశ్చర్యపోయిన అతను, వెంటనే ఆసుపత్రి అకౌంట్స్ విభాగానికి వెళ్లి ఐటమైజ్డ్ బిల్ (అంటే ప్రతి మందు బిళ్ళ, ప్రతి ఇంజెక్షన్, ప్రతి సేవకు విడివిడిగా ధరలు ఉండే నివేదిక) కావాలని కోరారు.

బయటపడ్డ తప్పులు:

ఐటమైజ్డ్ బిల్లును పరిశీలించగా, అందులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. రోగికి అసలు ఇవ్వని కొన్ని ఖరీదైన మందుల ధరలు బిల్లులో చేర్చారు. ఒకే రకమైన ల్యాబ్ పరీక్షలకు రెండుసార్లు ఛార్జీలు వేశారు. సర్వీస్ ఛార్జీల పేరుతో అనవసరమైన రుసుములు కలిపారు. వీటన్నింటినీ ఆధారాలతో సహా ప్రశ్నించినప్పుడు, ఆసుపత్రి సిబ్బంది అది సాంకేతిక పొరపాటు అని చెబుతూ వెంటనే బిల్లును సవరించారు. ఫలితంగా లక్ష రూపాయల బిల్లు రూ. 57,000లకు దిగి వచ్చింది.

ఇవి కూడా చదవండి

రోగులు, బంధువులకు నిపుణులు పలు సూచనలు చేశారు. ఐటమైజ్డ్ బిల్ అడగండి. కేవలం టోటల్ బిల్ కాకుండా, విడివిడి ఖర్చుల జాబితాను ఖచ్చితంగా తీసుకోండి. ఆసుపత్రి ఇచ్చిన మందుల చిట్టీని, బిల్లులో ఉన్న మందులతో సరిపోల్చుకోండి. ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, క్లెయిమ్ అమౌంట్ సక్రమంగా ఉందో లేదో చెక్‌ చేయడం ముఖ్యం అంటున్నారు. ఎందుకంటే..

Hospital Bill

వైద్యం అనేది ఒక సేవ అయినప్పటికీ, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండటం వల్ల మన కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us