డీలిమిటేషన్ బిల్లుతో ఎన్డీఏ స్కెచ్.. ఇండీ కూటమికి బిగుస్తున్న ఉచ్చు!
ఐదు శాతం ఉన్న ఒక వర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం దొరుకుతోంది. అత్యున్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంలో ఒక నిర్దిష్టమైన సామాజికవర్గానికి మాత్రమే పెద్దపీట పడుతోంది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ, మైనారిటీలకు తీరని అన్యాయం జరుగుతోంది. మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ లేవనెత్తిన ఈ లాపాయింట్.. జ్యుడిషియరీలో ఇన్నాళ్లూ ఉన్న ఒక తిరుగులేని అసమానతను బయటి ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ తేడాను గుర్తించండి, దయచేసి జోక్యం చేసుకోండి అని రాష్ట్రపతికి లేఖ కూడా రాశారాయన. న్యాయవ్యవస్థలోనే కాదు, డెమొక్రసీ మరో మూలస్థంభమైన ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలో కూడా ఇదేరకమైన అసమానతలు రిపీటైతే? అంబేద్కర్ చెప్పిన సమానత్వ స్పూర్తి దెబ్బతిన్నట్టేగా? ఇప్పుడు దేశంలో జరుగుతున్న డీలిమిటేషన్ డ్రైవ్‌లో ఇదే కీలకంగా మారింది. సౌత్-నార్త్ మధ్య, సామాజికవర్గాల మధ్య సమాన న్యాయం ప్రశ్నార్థకం కాబోతోంది. చట్టసభల్లో పెరగబోతున్న సీట్ల సంఖ్యపై కొత్త రకం రగడ మొదలైంది. ఏమిటో తెలుసుకుందాం..

ఏ రాష్ట్రానికీ ధమ్‌కీ జరగదు, దక్షిణాదికైతే పూర్తి న్యాయం జరుగుతుంది.. దీనికి నేనూ గ్యారంటీ అని ఢిల్లీకెళ్లి డీలిమిటేషన్ కోసం దక్షిణం దిక్కునుంచి గట్టిగానే పునాదులు వేశారు టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మహిళా బిల్లును అడ్డుకుంటే మగువల ఆగ్రహానికి గురవుతారని శాపం లాంటిది కూడా పెట్టేశారు. కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి మీడియా ముందుకొచ్చి సౌత్ తరఫున మోదీ సర్కారుకు పూర్తి భరోసా ఇచ్చేశారు. మోదీ ఏం చేసినా చరిత్రాత్మకంగా చేస్తారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్ల పెంపు అనేది విన్-విన్ ఫార్ములా అని, దీనికంటే సముచిత పరిష్కారం ఇంకోటి లేనేలేదని కూడా సర్టిఫై చేసుకుంటోంది బీజేపీ. ఇటు నుంచి స్టాలిన్ కూడా కోరస్ ఇచ్చేశారు. కనుక, సౌత్ అండ్ నార్త్ మధ్య ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియనైతే క్లియరైనట్టే. అంతమాత్రాన పునర్విభజనకు అన్నీ మంచి శకునములే అనుకోడానికీ లేదు. మరిన్ని దామాషా లెక్కలు పెండింగ్‌లోనే ఉండిపోయాయా? ఆమోదం పొందాలంటే ముసాయిదా బిల్లుకు ఇంకా ఏమేం రిపేర్లు చేయాలి? విపక్షం లేవనెత్తబోయే కొత్త లిటిగేషన్లేంటి? నారీశక్తికి మాట ఇచ్చాం.. కట్టుబడి ఉంటాం.. ఈసారి ఎవరొచ్చినా ఆపలేరు. దేశంలోని మహిళలందరి ఆశీర్వాదం మా వైపే ఉంది.. ఉంటుంది అని తన సంకల్పాన్ని మళ్లీ చాటుకున్నారు ప్రధాని మోదీ. 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపాం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల సాకారం కాబోతోంది,...
