AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఫలితాలపై ఉత్కంఠ..

ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 3,803 సర్పంచ్ స్థానాలతో పాటు 29,603 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరగనుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు భారీ భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. రెండో విడత పోలింగ్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఫలితాలపై ఉత్కంఠ..
Ap Panchayat Elections 2026 Phase 2
Krishna S
|

Updated on: Nov 28, 2026 | 10:07 PM

Share

ఏపీలో రెండో విడత పల్లె పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,880 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1,170 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో 10,295 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తం 49,318 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 19,655 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,603 స్థానాలకు ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో 63,395 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 83 లక్షల 52 వేల 338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఆదివారం ఉదయం నుంచి గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు 50,476 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు 9,300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు.. 8,470 వెబ్‌కాస్టింగ్ గదుల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు. ఇక రెండో విడతలో మొత్తం 1,095 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

ఫలితాలపై ఉత్కంఠ

ఇప్పటికే జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందగా, వైసీపీ బలపరిచిన అభ్యర్థులు కూడా పలు చోట్ల విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో విడత పోలింగ్, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Follow Us