చిలుక జోస్యం ఎలా చెబుతుంది? దీని వెనకున్న రహస్యం తెలుసా?
samatha
27 November 2026
Pic credit - Pinterest
కుబేర మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని వలన వాస్తు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
కుబేర మొక్క
ముఖ్యంగా కుబేర మొక్క ఇంటిలో ఉండటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. కాగా దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటిలో ఉంటే అనేక ప్రయోజనాలు
చాలా వరకు మన ఇళ్లలో కనిపించే కుబేర మొక్కను జేడ్ ప్లాంట్ అని పిలుస్తుంటాం. వాస్తు ప్రకారం దీనిని తరచుగా సంపదకు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
సంపదకు చిహ్నం
దక్షిణ ఆఫ్రికా ప్రాంతంలో జన్మించిన ఈ మొక్క నీరు తక్కువగా ఉండే వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. చాలా వేగంగా పెరుగుతుంటుంది.
నీరు తక్కువగా ఉండే వాతావరణం
కుబేర మొక్క ఆకులు చాలా మందంగా ఉంటాయి.దీనిని సక్యూలెంట్ ప్లాంట్ అని పిలుస్తారు. దీనిలోని అత్యంత విశేషమైన లక్షణం CAM ఫొటోసింథసిస్.ఇది అద్భుతమైన ప్రక్రియ.
మందమైన ఆకులు
అంటే ఈ మొక్క పగటిపూట నీటి నష్టాన్ని తగ్గించుకోవడానికి పత్ర రంధ్రాలను మూసివేసి, రాత్రిపూట వాటిని తెరిచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. మరుసటి రోజు పగటిపూట నిల్వ చేసిన కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఆహారాన్ని తయారుచేసుకుంటుంది.
నీటి నష్టం
అలాగే దీని ఒక ఆకు నుంచి కొత్త మొక్కను పెంచవచ్చు . సరైన జాగ్రత్తలు తీసుకుంటే, రాలిన ఆకు నుంచి చిన్న వేర్లు, మొలక వచ్చి కొత్త మొక్కగా ఎదుగుతుంది.
ఆకు నుంచి మొక్క
అంతే కాకుండా కుబేర మొక్క సంరక్షణలో నీరు చాలా ముఖ్యం. దీనికి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా నీరు పోయకూడదు. ఇలా పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.