AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

POKలో పాక్ సైన్యంపై యుద్ధానికి సిద్ధమైన ‘జన్‌బాజ్ ఫోర్స్’! ఘాజీ షెహజాద్ సంచలన హెచ్చరిక!

పాకిస్తాన్‌కు మరో కొత్త భద్రతా సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతాల్లో వివిధ సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోనూ ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కొనసాగుతున్న ప్రజా నిరసనల మధ్య ‘జన్‌బాజ్ ఫోర్స్’ అనే సాయుధ బృందం తెరపైకి వచ్చింది.

POKలో పాక్ సైన్యంపై యుద్ధానికి సిద్ధమైన ‘జన్‌బాజ్ ఫోర్స్’! ఘాజీ షెహజాద్ సంచలన హెచ్చరిక!
Janbaz Force
Balaraju Goud
|

Updated on: Nov 28, 2026 | 11:56 PM

Share

పాకిస్తాన్‌కు మరో కొత్త భద్రతా సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతాల్లో వివిధ సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోనూ ఉద్రిక్తతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ కొనసాగుతున్న ప్రజా నిరసనల మధ్య ‘జన్‌బాజ్ ఫోర్స్’ అనే సాయుధ బృందం తెరపైకి వచ్చింది. పాక్ సైన్యం నిరసనకారులపై సైనిక చర్యకు దిగితే తాము ఎదురుదాడి చేస్తామని ఈ బృందం హెచ్చరించినట్లు తాజా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రావల్కోట్ పరిసరాల్లో భద్రతాపరమైన ఆందోళనలు మొదలయ్యాయి.

పాక్ సైన్యానికి జన్‌బాజ్ ఫోర్స్ హెచ్చరిక!

తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఘాజీ షెహజాద్ కొందరు సాయుధ వ్యక్తులతో కలిసి కనిపించినట్లు కథనాలు వెల్లడించాయి. పాక్ భద్రతా బలగాలు ప్రజా నిరసనలను అణచివేసేందుకు సైనిక ఆపరేషన్ చేపడితే తాము కూడా ఆయుధాలతో ప్రతిఘటిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఇటుకకు రాయి’ అన్న తరహాలో పాక్ సైన్యానికి సవాల్ విసిరడం సంచలనంగా మారింది.

ఎవరీ ఘాజీ షెహజాద్?

జన్‌బాజ్ ఫోర్స్‌కు ఘాజీ షెహజాద్ నాయకత్వం వహిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇతడు పూంచ్ ప్రాంతంలోని గరాలా గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. 2023 మేలో జన్‌బాజ్ ఫోర్స్ ఏర్పాటును ప్రకటించిన అనంతరం అతడిని పాక్ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే 2024 జూన్ 30న రావల్కోట్ జిల్లా జైలు నుంచి 19 మంది ఖైదీలు తప్పించుకున్న ఘటనలో ఘాజీ షెహజాద్ కూడా ఉన్నాడు. ఈ జైలు నుంచి తప్పించుకోవడం పాక్ భద్రతా వ్యవస్థలో పెద్ద వైఫల్యంగా అప్పట్లో వార్తల్లో నిలిచింది.

ప్రజా ఉద్యమానికి సాయుధ పోరాటం తోడవుతోందా?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో ప్రజా హక్కులు, స్థానిక స్వయంప్రతిపత్తి, విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి అంశాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ప్రజా ఉద్యమానికి జన్‌బాజ్ ఫోర్స్‌ను అనుసంధానించడం సరికాదని JAAC నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ పోరాటం ప్రజాస్వామ్యబద్ధమైనదని, హింసకు తాము వ్యతిరేకమని ప్రకటించారు.

మరోవైపు, జన్‌బాజ్ ఫోర్స్ నిజంగా ఎంతటి బలాన్ని కలిగి ఉంది? దాని వెనుక ఎవరున్నారు? పాక్ సైన్యాన్ని ఎదుర్కొనే స్థాయిలో ఆ బృందానికి ఆయుధాలు, సభ్యుల సంఖ్య ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మొత్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తాజా పరిణామాలు పాకిస్తాన్‌కు కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. ప్రజల అసంతృప్తికి రాజకీయ పరిష్కారం చూపకుండా కేవలం సైనిక బలంతో అణచివేయాలని ప్రయత్నిస్తే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us