AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడూ ఒకేలా చికెన్ కూర కాకుండా.. ఈసారి శనగపప్పుతో ఇలా ట్రై చేయండి!

చికెన్, శనగపప్పుతో చేసే కూర రుచి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. ఇది మీ భోజనాన్ని మరింత రుచికరంగా మారుస్తుంది. మీ ఇంట్లోనే శనగపప్పు చికెన్ కర్రీని ఇంట్లో ఈజీగా.. రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Nov 28, 2026 | 10:37 PM

Share
ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పెనం పెట్టుకోవాలి. దీనిలో  రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత, రెండు మీడియం ఉల్లిపాయలను సన్నగా చీలికల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే, నాలుగు పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలతో పాటు వేయాలి. ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేపుకోవాలి..

1 / 5
ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వేసి, పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేపుకోవాలి. ఇది కూరకు మంచి సువాసనను ఇస్తుంది. ఇది బాగా కడిగి శుభ్రం చేసుకున్న అర కిలో చికెన్‌ను నూనెలో వేయాలి. చికెన్‌ను రెండు, మూడు సార్లు నీటితో కడగడం వలన మీరు దీనిలో ఎలాంటి క్రిములు లేకుండా చూసుకోవచ్చు. చికెన్‌ను వేసిన తర్వాత బాగా కలుపుకుని, ఐదు నిమిషాలు వేయించాలి

2 / 5
ఒక చిన్న గ్లాసుడు శనగపప్పును కనీసం అరగంట ముందు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. నానబెట్టిన శనగపప్పు నుండి నీటిని వడగట్టి, చికెన్‌తో పాటు వేసుకోవాలి. శనగపప్పు , చికెన్‌ను బాగా కలిపి, మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. ఈ సమయంలో చికెన్ నుండి నీరు బయటకు వస్తుంది.

3 / 5
ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే, ఒక స్పూన్ ఇంట్లో తయారుచేసిన గరం మసాలా పొడిని వేయాలి. ఇంట్లో తయారుచేసిన గరం మసాలా అందుబాటులో లేకపోతే, చికెన్ మసాలా పొడిని కూడా వేయవచ్చు. . చివరగా, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి, మసాలాలు చికెన్ ,  శనగపప్పుకు బాగా పట్టేలా కలపాలి.

4 / 5
పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, నూనె కొద్దిగా పైకి తేలుతుంది. కూరను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ,  శనగపప్పు పూర్తిగా మునిగేంత వరకు తగినంత నీరు పోయాలి.  కూరను హై ఫ్లేమ్‌లో పది నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల చికెన్, శనగపప్పు సమానంగా ఉడుకుతాయి. పది నిమిషాల తర్వాత మంటను సిమ్‌లో పెట్టి, ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. నూనె పైకి తేలి, కూర గ్రేవీ చిక్కగా మారుతుంది. చివరిగా, ఒక స్పూన్ గరం మసాలా,  కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి, స్టవ్ ఆపివేయాలి.

5 / 5
Follow Us